Saturday, February 15, 2025

విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు

- Advertisement -

విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు

Implementation of common diet program to provide nutritious food to students

జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

విద్యార్థులకు,తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా చర్యలు

40% డైట్, 200% కాస్మెటిక్ చార్జీలను ప్రజా ప్రభుత్వం పెంచింది

జగిత్యాల, పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో జిల్లా కలెక్టర్ భోజనం

జగిత్యాల, డిసెంబర్ 14:

రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిందని అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలోని తాటిపెల్లి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్  మరియు జగిత్యాల భవాని నగర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) పాటు పెద్దాపూర్ గురుకుల పాఠశాల కలెక్టర్ గారు పాల్గొన్నారు.
అనంతరం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి  విద్యా బోధన, వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన కొత్త డైట్ మెన్యూ ను జిల్లా కలెక్టర్ బి , సత్య ప్రసాద్ ప్రారంభించారు.
ప్రజా ప్రభుత్వంలో పిల్లలకు కల్పించే సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు  వారిని ఆహ్వానిస్తున్నామని అన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నేటి నుండి నూతన డైట్ మెస్ చార్జీలు పెంచడం జరిగింది.
నేటి నుండి అమల్లోకి వచ్చిందని. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని పిల్లలతోపాటు ఉపాధ్యాయులు కూడా కలిసి భోజనం చేసారని తెలిపారు.
అలాగే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.
కచ్చితంగా మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తూ  రిజిస్టర్ నమోదు చేస్తూ పాటించాలని సూచించారు.
రోజువారి భోజనం బాగుందా లేదా అని విద్యార్థుల కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
విద్యార్థులందరూ మంచిగా చదువుకొని పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు తెలిపారు. గురుకులాలకు గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టామని, ఇక పై నాణ్యతతో కూడిన వస్తువులు మాత్రమే సరఫరా చేయాలని, ఎక్కడ నాణ్యత లోపించిన ఉపేక్షించ కుండా కఠిన చర్యలు తీసుకుంటామని  కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలలో పరిశుభ్రతకు ఎక్కడ లోటు లేకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఉపాధ్యాయులు అంతే జాగ్రత్తగా చూసుకోవాలని, మన గురుకులాల్లో చదివే పిల్లల పట్ల మనం బాధ్యతతో ఉండాలని తెలిపారు.
డైట్ చార్జీలను 3 నుంచి  7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి 1330 రూపాయలకు, 8 నుంచి  10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్  నుంచి  పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజా ప్రభుత్వం పెంచిందని, అదేవిధంగా కాస్మెటిక్ చార్జీలను బాలికలకు  7వ తరగతి  వరకు  55 నుంచి  175  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలికలకు 75 నుంచి  275 రూపాయలకు, బాలురు  7వ తరగతి  వరకు  62 నుంచి  150  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలురు 62 నుంచి  200 రూపాయలకు పెంచినట్లు కలెక్టర్ తెలిపారు ..వైద్యులతో సంప్రదించి పిల్లల ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పోషకాలు అందించేలా  కామన్ డైట్ కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజు కుమార్, మెట్ పెల్లి ఆర్డీవో, శ్రీనివాస్, తహసిల్దార్లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్