రోడ్లపైన, కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించండి–కమిషనర్ ఎన్.మౌర్య

- Advertisement -

రోడ్లపైన, కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించండి–కమిషనర్ ఎన్.మౌర్య

Impose fines for littering on roads and canals--Commissioner N. Maurya

తిరుపతి
నగరంలో ఎవరైనా రోడ్లపైన, మురుగు కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య హెల్త్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం తెల్లవారుజాము నుండి నగరంలోని చిన్న బజారు వీధి, ఆకుతోట వీధి, నాదముని వీధి, కొత్త వీధి, కోటకొమ్మల వీధి, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. చెత్త తీసుకెళ్లే వాహనం ఎన్ని గంటలకు వస్తుంది? మురుగు కాలువల్లో చెత్త తొలగిస్తున్నారా? నీరు ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు? నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నారా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిన్న బజారు వీధిలో దుకాణాల ముందు చెత్త వేసి ఉండడం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాలు మూసిన తరువాత వేస్తున్నారని సిబ్బంది చెప్పగా, జరిమానాలు విధించాలని అన్నారు.*

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎవరైనా రోడ్లపైన, కాలువల్లో చెత్త వేస్తే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అన్నారు. పలు చోట్ల మురుగు కాలువల్లో చెత్త తొలగించలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, సిబ్బంది పరిశీలించి శుభ్రం చేయాలని అన్నారు. దుకాణాల ముందు చెత్త వేస్తున్న వారికి జరిమానాలు విధించి, చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి రోజూ వాహనాలు నిర్దిష్ట సమయంలో వాహనాలు వెళ్లేలా చూడాలని అన్నారు. ప్రతి రోజూ నీటి సాంద్రత పరీక్షలు చేసి, నీటిని సరఫరా చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పిర్యాదు చేసిన వారిని స్వయంగా కమిషనర్ కలసి సమస్యలకు పరిష్కార మార్గం చూపారు.

కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, మేస్త్రి లు, అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular