Saturday, March 15, 2025

6 నెలల్లో రూ. 670 కోట్లు

- Advertisement -

6 నెలల్లో రూ. 670 కోట్లు
తిరుమల, ఆగస్టు 3,

In 6 months Rs. 670 crores

తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో రూ. 670 కోట్లకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో మరో రూ 125.35 కోట్లు జమైంది. ఈ మధ్యకాలంలో ఘననీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. వెంకన్నకు కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను కూడా అమాంతంగా పెంచుతోంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం రూ. 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. జనవరిలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది. ఇక జులై మాసంలో శ్రీవారికి మరో రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం దక్కింది.ఈ ఏడాది ముగిసిన ఏడు మాసాల్లో అత్యధిక హుండీ ఆదాయం జులై మాసంలోనే లభించడం విశేషం. 2022 మార్చి నెల నుంచి వరుసగా గత 29 మాసాలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లకు పైగానే ఉంటోంది. కొన్ని మాసాల్లో రూ.125 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. ఇప్పుడు జులై మాసంలోనూ హుండీ ఆదాయం రూ.125 కోట్లకు పైగా వచ్చింది.
2024లో నెల వారీగా హుండీ ఆదాయం వివరాలు..
జనవరి – రూ. 116.46 కోట్లు
ఫిబ్రవరి – రూ 111.71 కోట్లు
మార్చి – రూ 118.49 కోట్లు
ఏప్రిల్ – రూ 101. 63 కోట్లు
మే – రూ 108.28 కోట్లు
జూన్ – రూ 113.64 కోట్లు
జులై – రూ.125.35 కోట్ల
గత జూలై నెలలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.  కోటి 4 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించింది టిటిడి. 24.04 లక్షల మంది భక్తులు జులై మాసంలో అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు టీటీడీ వెల్లడించింది. 8.67 లక్షల మంది భక్తులు తలనీలలు సమర్పించుకున్నారు.తిరుమల అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టిటిడి ఇఓ శ్యామలరావు జూలై నెల వివరాలను ప్రకటించారు. తమిళనాడులోని తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామన్నారు శ్యామలరావు. అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్నప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మార్చుతున్నట్లు ప్రకటించిన ఈఓ శ్యామల రావు.. తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.దళారీలను అరికట్టడంలో భాగంగా పదే పదే టిక్కెట్లు పొందుతున్న 40వేల మంది ఐడిలను బ్లాక్ చేశామన్నారు. తిరుమలలోని హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలిపారు. అలాగే  లడ్డూ తదితర ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ మేరకు నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్