ఇంచార్జ్ ఏడి ఇష్టారాజ్యం .
In charge is AD wish
అనుమతులు లేవు చర్యలకు వెనుకడుగు.
అవినీతిపరులకు ఆయన అండా దండా.
వరంగల్
హనుమకొండ మైనింగ్ శాఖలో ఇన్చార్జి ఏ డి ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి గత రెండు నెలల క్రితం హనుమకొండ మైనింగ్ శాఖ ఏడి సెలవు పై వెళ్లడంతో వరంగల్ ఏ డి అదనపు బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిలో ఆయన అవినీతి బాగోతానికి తెరలిపినట్లు జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు ఎవరేమనుకుంటే నాకేమి లే అన్న రీతిలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనుమతులు లేకుండా నడుపుతున్న క్రషర్ యజమానుల వద్ద అడ్డగోలుగా మామూలు దండుకున్నట్టు జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలంలో గల శ్రీరామాంజనేయ స్టోన్స్ క్రషర్ పరిధికి మించి పనులు జరుగుతున్న మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు ఎందుకు ఉంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రతినెల ఆ క్రషర్ యజమాని తీసుకునే పరిమిట్ల కంటే ఎక్కువ మొత్తంలో మైనింగ్ చేస్తూ ఉన్నప్పటికీ అధికారులు ఉదాసీనంగా ఉండడం వెనుక కారణాలు ఏమిటంటే ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు శ్రీ రామాంజనేయ క్రషర్ నిర్వహణకు సరైన రీతిలో అనుమతులు లేకున్నా చర్యలకు మైనింగ్ శాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకుంటాలేరని ప్రశ్నిస్తున్నారు సర్వేనెంబర్ 69 లో ఉన్న పరిధికి మించి తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఎన్నోసార్లు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వనరులను కాపాడవలసిన మైనింగ్ శాఖ అధికారులు మామూలు మత్తులో తూలుతూ ప్రజాధనానికి గండి కొడుతున్నారని మండల ప్రజల ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు శ్రీరామాంజనేయ స్టోన్ క్రషర్ పై తనిఖీ చేసి గత కొంతకాలంగా అనుమతులకు తీసిన దానిపై సర్వే చేసి చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు పరిధికి మించి తీసిన మెటల్ పై పెనాల్టివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అవినీతిపరులకు ఆయనే అండ దండ
అనుమతులు లేకుండా జిల్లాలో క్రషర్లు నిర్వహిస్తున్న వారికి ఆయనే అండ దండ అన్న విమర్శలు జిల్లాలో వినిపిస్తున్నాయి హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో గల స్త్రీ శక్తి స్టోన్స్ క్రషర్ పై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకుపోవడం దేనికి సంకేతం అని ప్రజలు చర్చించుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాల క్రితం ధర్మసాగర్ మండలంలోని స్త్రీ శక్తి స్టోన్స్ క్రషర్ మండలంలోని ఓ కులం చెందిన కొంతమంది కార్మికులకు ప్రభుత్వం కేటాయించింది అయితే వారు ఆ క్వారీని నడపడంలో ఇబ్బందులు ఏర్పడగా మైనింగ్ శాఖ అధికారులు లీజు పేరుతో ఒకరికి కట్టబెట్టడం వెనుక మైనింగ్ అధికారుల ప్రమేయంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి కార్మికులు వృత్తిపని ద్వారా చేసుకుని కుటుంబాలను పోషించుకునే విధంగా అనుమతులు ఉండగా లీజు తీసుకున్న వ్యక్తి అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తూ పెద్ద మొత్తంలో మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్లు మండల ప్రజల ఆరోపిస్తున్నారు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న భారీ యజమానుల పైన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు చోటుచేసుకున్నాయి ఇన్చార్జి ఎడిగా ఉన్న అధికారి అనుమతులు లేని పారి యజమానుల వద్ద నుండి పెద్ద మొత్తంలో మామూలు దండుకొని అనుమతులు ఇస్తున్నట్లుగా జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వారి క్రషర్లపైన మైనింగ్ అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే ఆ కార్యాలయం ముందు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఐ ఎంఎల్ లేబరేషన్ జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు అధికారులను కోరారు.