Sunday, September 8, 2024

గణపతి ఉత్సవాలలో…  ఐదు లక్షల రూపాయల బహుమతి

- Advertisement -

భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలు పాటిస్తూ మంచి అలంకరణ ఆధ్యాత్మికంగా ఉన్న వినాయకులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తా : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…

వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో :  గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని రాధాకృష్ణ గార్డెన్ లో మట్టి వినాయక ప్రతిమలతో మంచి అలంకరణతో ఆధ్యాత్మికంగా ఏర్పాటుచేసిన వినాయకులకు ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…  భక్తిశ్రద్ధలతో మంచి అలంకరణతో ఆధ్యాత్మికంగా ఉన్న వినాయకుల కమిటీ సభ్యులకు శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఎంపిక చేసిన వారిలో డ్రా తీసి ఎమ్మెల్యే నరేందర్ బహుమతుల ప్రధానోత్సవం చేశారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ…

in-ganapati-utsavam-a-prize-of-five-lakh-rupees
in-ganapati-utsavam-a-prize-of-five-lakh-rupees

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కాలనీలలో భక్తిశ్రద్ధలతో పూజలు అందుకుంటున్న గణనాధులను శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రధానం చేయడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ గణేష్ ఉత్సవ సమితి వారిని ఎమ్మెల్యే అభినందించారు

వచ్చే ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలలో మట్టి గణపతిని పూజించి సాంస్కృతిక సాంప్రదాయ బద్ధంగా నియమ నిబంధనలకు లోబడి గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించే వారిని ఎంపిక చేసి వారికి మొదటి బహుమతిగా ఐదు లక్షల రూపాయలు రెండవ బహుమతిగా 3 లక్షల రూపాయలు మూడవ బహుమతిగా రెండు లక్షల రూపాయలు తాను అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆ గణనాధుని ఆశీస్సులతో రాష్ట్ర తూర్పు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కోరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశం లో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామని 4100 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆ గణపయ్య ఆశీస్సులతో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే కోరారు

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గందే కల్పననవీన్, శ్రీ గణేష్ ఉత్సవ కమితి అధ్యక్షులు క్యాతం రవీందర్, బిఆర్ఎస్ నాయకులు దుబ్బ శ్రీనివాస్, శ్రీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, డివిజన్ ముఖ్య నాయకులు యూత్ నాయకులు ఉత్సవాల కమిటీ సభ్యులు హాజరయ్యారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్