- Advertisement -
గోషామహల్ లో మరోసారి కుంగిన చాక్నవాడి నాలా
In Goshamahal once again, I was a crippled chaknavadi Nala
హైదరాబాద్
దారుస్సలాం రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగిపోయింది. గురువారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో సివరేజ్ పెద్ద నాలా కుంగిపోయింది. పు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు ప్రక్కనే ఉన్న మరో నాలా కుంగి నాలలో క్రషర్ లారీ పడిపోయింది. పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలతో లారీ డ్రైవర్ బయటపడ్డాడు. ఇప్పటికి మూడోసారి కుంగిన ఘటన. నాలా మొత్తం పునరుద్ధరించాలని పదే,పదే ఎన్నిసార్లు ప్రభుత్వనికి మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా నాలాలు కుంగడం వల్ల ప్రాణనష్టం జరిగితే ఎవరు బాద్యులు అని ప్రశ్నించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు..ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యం నాలాలు కుంగడం వల్ల రకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని…తమ సమష్యాను పరిష్కరించకపోతే నాలా పై పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడుతము అని హెచ్చరించారు.
- Advertisement -