ఎల్బీనగర్‌లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికే తమ మద్దతు

- Advertisement -

ఎల్బీనగర్‌లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికే తమ మద్దతు

మరోసారి కేసీఆర్‌ సీఎం కావడం ఖాయం

:విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ అర్చక ప్రతినిధులు

వనస్థలిపురం, వాయిస్ టుడే:

బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని బ్రాహ్మణ అర్చన సంఘం ప్రతినిధులు డాక్టర్‌ గుండెపుడి శివ సుధీర్‌శర్మ అన్నారు. ఎల్బీనగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ అర్చన సంఘం ప్రతినిధులు ఎల్బీనగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో సుమారు 25వేల మంది బ్రాహ్మణ అర్చకులు, శివస్వాములు, అయ్యప్పస్వాములు, ఆంజేయస్వామి మాలాధారణ చేసిన వారు ఉన్నారని తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి, ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేశారని, రాబోయే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని కోరారు. అదే విధంగా ఎల్బీనగర్‌ అభివృద్ధికి అన్నీవిధాలా కృషి చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన పేర్కొన్నారు. సుధీర్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు శ్రీశివశక్తి నిత్యాన్నదాన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొప్పుల కాటంరాజు అన్నారు. సుధీర్‌రెడ్డిని విమర్శించేవారు నిజనిజాలను తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో ప్రతినిధులు ఆనంద్‌రావు, గోపాల్‌, శ్రీనివాసాశాస్త్రి, కృష్ణశాస్త్రి, రాంశాస్త్రి, అధిక సంఖ్యలో శివస్వాములు, అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular