Monday, July 14, 2025

బతుకమ్మ చీరల పథకంలో అవినీతే..

- Advertisement -

బతుకమ్మ చీరల పథకంలో అవినీతే..
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్

In the Bathukamma saree scheme, Avinee..

సభను తప్పుదోవ పట్టించటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో జొప్పిస్తున్నారన్నారు.
బతుకమ్మ చీరల పథకంలో అవినీతే.
సభను తప్పుదోవ పట్టించటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో జొప్పిస్తున్నారన్నారు. పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయని.. ప్రజల అనుభవాలు వారికి ఉన్నాయన్నారు. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్నారు. పదేళ్ల పాలన చేసిన వారు పది నెలలు పూర్తి చేసుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందన్నారు. నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ బినామీలకు అప్పగించారని. సూరత్‌ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్‌ కొట్టేశారని రేవంత్ ఆరోపించారు. ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకూ వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలన్నారు. మేమెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని చెప్పలేదన్నారు. హుస్సేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని. టూరిజం హబ్‌ క్రియేట్‌ చేస్తామంటున్నామని తెలిపారు. ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్‌ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏషియన్‌ గేమ్స్‌ నిర్వహించిన హైదరాబాద్‌లో.. స్టేడియమ్స్‌ అన్నీ తాగుబోతుల అడ్డాగా మారాయని రేవంత్ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో కాంస్యం వస్తేనే వందకోట్ల మంది సంబరపడే పరిస్థితి నెలకొందన్నారు. నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వలేదని రేవంత్ అన్నారు. మహ్మద్‌ సిరాజ్‌కు గ్రూప్‌1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. ఫార్మాసిటీ అని వాళ్లన్నారని.. మేం ఫార్మా విలేజ్‌లు అంటున్నామన్నారు. వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెడితే ఆ ప్రాంతమంతా కలుషితమవుతుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేటీఆర్‌ 100 శాతం ఆర్టిఫీషియల్‌, సున్నా శాతం ఇంటెలిజెన్స్‌ అన్నారు. ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని రేవంత్ అన్నారు. ముచ్చర్లలో నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నామని.. మన భవిష్యత్‌ నగరంగా ముచ్చర్ల కాబోతుందని.. మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలైపోయాయని. ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించాలని హితవు పలికారు. కేసీఆర్‌ చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ వేసుకొని వచ్చానన్నారు. అగ్రికల్చర్‌, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్‌ పాలసీలు తీసుకొస్తామని రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్