గత పదేళ్లలో తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని మోపారు
ప్రజావాణిలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే అందుకు ఉదాహరణ
కేటీఆర్ లక్ష కోట్ల అక్రమ సంపాదన అంతా కక్కిస్తాం
5 గ్యారెంటీల ఉమ్మడి దరఖాస్తు పత్రాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 27
గత పదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని, ప్రజావాణిలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే అందుకు ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో 5 గ్యారెంటీలకు సంబంధించిన ఉమ్మడి దరఖాస్తు పత్రాన్ని సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత పదేళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోందన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు తమ మీద మరింత విశ్వాసం కలుగుతుందన్నారు. గతంలో గడీల మధ్య పాలనా నడిచిందని.. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల కోసం వారి వద్దకు వెళ్తుందన్నారు.ఒకప్పుడు సచివాలయం అంటే ఏదో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని ఎవరైనా ఊహించారా అని అడిగారు. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్ ఉంటుందన్నారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కేటీఆర్ లక్ష కోట్ల సంపాదన నుంచి లక్ష రూపాయలు బాధిత మహిళకు ఇచ్చారని, మిగతా సొమ్ము అంతా కక్కిస్తామని హెచ్చిరంచారు.
గత పదేళ్లలో తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని మోపారు
- Advertisement -
- Advertisement -



