Thursday, March 5, 2026

కిట్టీ పార్టీ పేరుతో.. రమ్మీ ఆడుతున్నమమ్మీలు

- Advertisement -
In the name of kitty party.. mummies playing rummy
In the name of kitty party.. mummies playing rummy

హైదరాబాద్‌ :జులై 30: మధురానగర్‌ లో నిన్న రాత్రి 13 మంది మహిళలు అరెస్ట్  అయ్యారు. వీరంతా ఓ అపార్ట్‌మెంట్‌లో రమ్మీ ఆడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రమ్మీ ఆడుతున్న మహిళలను చూసి పోలీసులే అవాక్కయిన పరిస్థితి.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 13 మంది మహిళలను అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రెండు టేబుల్స్‌లో మహిళలు గ్యాంబ్లింగ్  నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు వ్యాపారవేత్తలు, ఏడుగురు హౌస్ వైఫ్‌లు ఉన్నారు. రెండు నెలల నుంచి గ్యాంబ్లింగ్ నిర్వస్తున్నట్టు విచారణలో పోలీసులు తేల్చారు. కాగా మహిళల నుంచి లక్షా ఇరవై వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. మహిళల వయస్సు 50-70 ఏళ్ల మధ్య ఉంటుందని.. కిట్టీ పార్టీ పేరుతో వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. రెండు నెలలుగా ఇదంతా జరుగుతోందని మహిళలే పోలీసులకు చెప్పడం గమనార్హం. కాగా..  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్