Thursday, March 5, 2026

గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డాం – సీఎం కేసీఆర్

- Advertisement -
In the past, we suffered a lot due to electricity, water or anything else- CM KCR
In the past, we suffered a lot due to electricity, water or anything else
– CM KCR

కామారెడ్డి / జుక్కల్, అక్టోబర్ 30 ( వాయిస్ టుడే ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ చౌరస్తా బహిరంగ సభ లోని కేసీఆర్ మాట్లాడుతూ…గతంలో కరెంట్ , నీళ్ళు, లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (సీఎం కేసీఆర్) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా, జుక్కల్‌ చౌరస్తా లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ… జుక్కల్‌ లో మంచి నీళ్ళ కోసం బాధ పడ్డామని, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ సమస్య లేకుండా నీళ్ళ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మంచీ.. చెడును చూసి.. ఆలోచించి ఓటేయ్యాలని సూచించారు.
మూడు రాష్ట్రాల సంగమ ప్రాంతమీదని, మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నప్పటికీ సంక్షేమం లేదని, కర్ణాటకలో సరిగా కరెంట్ ఇవ్వడంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంట్‌కే గొప్ప అంటున్నారని, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పాలన్నారు. అంజిమాన్‌లో లోన్‌లు ఉంటే ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారని, రైతు భీమా చేశామని, బాధితులకు వారం రోజుల్లో రూ.5 లక్షలు అందిస్తున్నామని, అదేవిధంగా రెండు దఫాలుగా రూ. 37 వేల కోట్ల రుణ మాఫీ చేశామని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రైతు బంధు ఆపామని, ఎన్నికలు అవ్వగానే అకౌంట్లలో వేస్తామని కేసీఆర్ అన్నారు. లెండి ప్రాజెక్ట్ ద్వారా అధికారంలోకి రాగానే నీళ్ళు అందిస్తామని, నాగ మడుగు ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. గతంలో జుక్కల్‌కు పిల్లనివ్వలంటే భయ పడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దళిత బంధు పథకంను భారత దేశంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని, దఫాలుగా అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. జుక్కల్‌లో పీజీ, డిగ్రీ కాలేజ్ వచ్చిందని, కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రం అభివృద్ది చెందలేదన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 18 వేలతో దేశంలో అభివృద్ధిలో ముందున్నామన్నారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 22 వందల యూనిట్లతో దేశంలోనే నెంబర్ వన్‌లో ఉన్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్