తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోస్టర్ ఆవిష్కరణ..
Inauguration of Telangana activists forum poster..
హుజురాబాద్ ఇన్చార్జి వొడితల ప్రణవ్..
జమ్మికుంట
ఈ నెల 27,28 వ తేదీల్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహా పాదయాత్ర సందర్భంగా, హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, సమక్షంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్, మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల కృషి మరువలేనిదని గుర్తు చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని వదిలేశారని, కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగిందని అన్నారు.
తెలంగాణలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యువజన కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, నియోజక వర్గం అధ్యక్షులు ఊకంటి మల్లాచారి, రావుల రాజ బాబు, ఆరె రమేష్ రెడ్డి, వినయ్, శ్రీకాంత్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు…