ఇండియా బదులు భారత్

- Advertisement -

న్యూఢిల్లీ, అక్టోబరు 25, (వాయిస్ టుడే): ఇండియా పేరుని భారత్‌గా మార్చేస్తారంటూ చాలా రోజులుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన G20 సదస్సులోనూ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న చోట India కి బదులుగా Bharat అని రాసుండటం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఇకపై NCERT పుస్తకాల్లో India అనే పేరుని తొలగించనున్నారు. ఆ స్థానంలో Bharat అని ముద్రించనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసి చర్చించారు. ఆ తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై  NCERT పుస్తకాల్లో India అనే పేరు కనిపించదు. కొన్ని నెలల క్రితమే ఈ ప్రతిపాదనలు రాగా..ప్యానెల్‌ చర్చలు జరిపింది. ప్యానెల్‌లోని సభ్యులంతా అందుకు ఆమోదం తెలపడం వల్ల అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది NCERT.

india-instead-of-india
india-instead-of-india

G20 సదస్సు సమయంలోనే ఈ చర్చ బాగా జరిగింది. ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ ఆహ్వానంలో President of India కి బదులుగా President of Bharat అని రాసుంది. ఇది రాజకీయంగానూ కాస్త అలజడి రేపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1)లో “India, that is Bharat” అని స్పష్టంగా రాసుంది. అందుకే…కేంద్రం ఇండియాకి బదులుగా భారత్ పేరునే పాలనా వ్యవహారాల్లో వినియోగించాలని యోచిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన సంకేతాలనూ ఇచ్చింది. మరో కీలక విషయం ఏంటంటే…NCERT పుస్తకాల్లో “Hindu Victories” పేరిట ప్రత్యేకంగా ఓ పాఠం చేర్చాలని ప్రతిపాదించింది. అదే విధంగా చరిత్రకు సంబంధించిన పాఠాల్లోనూ మార్పులు చేయాలని తెలిపింది. బ్రిటీష్ వాళ్లు చెప్పిన చరిత్రను పూర్తిగా పక్కన పెట్టేయాలని భావిస్తోంది. వీటితో పాటు సిలబస్‌లో ని ప్రవేశపెట్టాలని ప్యానెల్ ప్రతిపాదించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular