Sunday, September 8, 2024

ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్..  యశోభూమి

- Advertisement -

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ద్వారకలో అత్యాధునిక సౌకర్యాలతో ‘యశోభూమి’ పేరుతో నిర్మించిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి ద్వారకా సెక్టార్ 25 వద్దనున్న కొత్త మెట్రో స్టేషన్ వరకు.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ ను  కూడా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశరాజధానిలో యశోభూమి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

India International Convention Centre..  Yashobhumi
India International Convention Centre..  Yashobhumi

యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు..

యశోభూమి కేంద్రం రూ. 4,400 కోట్ల వ్యయంతో 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రధాన ఆడిటోరియంతో సహా 15 సమావేశ గదులు ఉన్నాయి. ఇది ఒక గ్రాండ్ బాల్‌రూమ్, 11,000 మంది ప్రతినిధులు కూర్చునే సామర్థ్యంతో ఈ 13 సమావేశ గదులను నిర్మించారు.

యశోభూమిలో అత్యంత విస్తృతమైన LED మీడియా విభాగాన్ని కూడా నిర్మించారు. సుమారు 2,500 మంది అతిథులకు వసతి కల్పించగల విశాలమైన బాల్‌రూమ్‌తో.. పెద్ద పెద్ద ఈవెంట్‌లు నిర్వహించుకునేలా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. అదేవిధంగా అక్కడున్న వారందరికి భరోసా కల్పించేలా వేదిక వద్ద అత్యాధునిక భద్రతా చర్యల కోసం ఏర్పాట్లు చేశారు.

India International Convention Centre..  Yashobhumi
India International Convention Centre..  Yashobhumi

అదనంగా, కన్వెన్షన్ సెంటర్‌లో 1,07,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ ప్రాంతం కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనల (MICE) కోసం సౌకర్యవంతం చేసేలా మోడీ ప్రభుత్వం తీర్చిదిద్దింది.

ప్లీనరీ హాల్ సుమారు 6,000 మంది అతిథులు కూర్చునే సామర్థ్యంతో నిర్మించారు.

‘యశోభూమి ద్వారకా సెక్టార్ 25’ ప్రారంభోత్సవంతో ఇది కొత్త మెట్రో స్టేషన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్‌కు అనుసంధానించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.

India International Convention Centre..  Yashobhumi
India International Convention Centre..  Yashobhumi

యశోభూమి ద్వారకా సెక్టార్-25 మెట్రో స్టేషన్:

స్టేషన్ ప్రారంభోత్సవం తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు. రాబోయే మెట్రో స్టేషన్‌లో మూడు సబ్‌వేలు ఉంటాయి: ఒకటి 735 మీటర్ల పొడవుతో స్టేషన్‌ను ఎగ్జిబిషన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్, సెంట్రల్ అరేనాతో అనుసంధానిస్తుంది. రెండవ సబ్‌వే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఉన్న ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్‌లకు అనుసంధానించారు. మూడవది మెట్రో స్టేషన్‌ను యశోభూమి భవిష్యత్తు ఎగ్జిబిషన్ హాల్స్ ఫోయర్‌కు కలుపుతుందని ప్రకటనలో తెలిపారు.. న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి ‘యశోభూమి ద్వారకా సెక్టార్ 25’ వరకు మొత్తం ప్రయాణం దాదాపు 21 నిమిషాలు పడుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్