భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
India Budget 2024-25
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సాధించిన విజయాలను గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల ఏడాది కావడంతో మధ్యంతర బడ్జెట్ అయిన్పటికీ ఈ బడ్జెట్ పై మరింత ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇదే తొలి మధ్యంతర బడ్జెట్ కావడం విశేషం. లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉండటంతో ఆర్థిక మంత్రి కూడా ఈ బడ్జెట్ లో పలు భారీ ప్రజాకర్షక ప్రకటనలు చేస్తున్నారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా సానుకూల మార్పును చూసిందని నిర్మలా సీతారామన్ గురువారం అన్నారు. సాంకేతికంగా ఓట్ ఆన్ అకౌంట్ గా, మధ్యంతర బడ్జెట్ గా పిలువబడే ఎన్నికలకు ముందు …
ఈనెల 8న ప్రభుత్వ విద్య సంస్థలకు సెలవు



