ఆహారం మిగిలి ఉంటే సమాచారం ఇవ్వండి
Inform if there is food left overమేము వచ్చి తీసుకెళ్తాం
గుంటూరు,అక్టోబర్ 27
ఫంక్షన్లలో ఆహారం మిగిలి ఉంటే వృధా చేయవద్దని సమాచారం ఇస్తే ఆఆహారాన్ని మేమే మీ వద్దకు వచ్చి ఆహారాన్ని తీసుకువెళ్లి ఆకలిగా ఉన్న వారి ఆకలి తీరుస్తామని జన చైతన్య సమితి కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని జలాలపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ మన్నవ శవ్రియ్య ఇంటి ఫంక్షన్ లో ఆహారం మిగిలిందని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో జన చైతన్య సమితి బృందం ఆదివారం రాత్రి వారి గృహం వద్దకు వెళ్లి మిగిలిన ఆహారాన్ని తీసుకువెళ్లి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాల ముందు రాత్రి 12 గంటల తరువాత ఆకలిగా ఉన్న సుమారు100 మందికి ఆహారం పెట్టి వారి ఆకలి తీర్చారు.అర్ధరాత్రి సమయంలో ఎక్కడ భోజనం లేక ఎంతోమంది డబ్బులు ఉన్నా కొనుక్కుని తినే పరిస్థితి లేదు.అలాంటి పరిస్థితులలో ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టటం ఎంతో తృప్తినిచ్చిందని సాంబశివరావు అన్నారు. ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని సేకరించి ఆహారం దొరకని వారి కడుపు నింపటమే తమ లక్ష్యమని జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు అన్నారు. ఈకార్యక్రమంలో జన చైతన్య సమితి ప్రతినిదులు గుడిపూడి విజయ్ కుమార్,గుడిపూడి తరుణ్ కుమార్,నెహ్రూ యువ కేంద్ర నేషనల్ యూత్ వాలంటీర్ గుడిపూడి మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆహారం మిగిలి ఉంటే 9885557987,8886777767 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని సాంబశివరావు తెలిపారు




