శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్
మహనీయులు దేశానికి ఆస్తి
మంత్రి గంగుల కమలాకర్
కమ్యూనిటీ హాల్ నూతన భవనాలకు భూమిపూజ
కరీంనగర్ 10(వాయిస్ టుడే): మహానీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లు ఏ కులానికో పరిమితమైన వారు కాదని, వారు ఈ దేశానికి ఆస్తి అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం నగరంలో మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని అటవీ శాఖ అధికారి కార్యాలయ సమీపంలో ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం 25వ డివిజన్ కిసాన్ నగర్ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో స్థానిక కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి లతో కలిసి 20లక్షల సాధారణ నిధులతో బాబు జగ్జీవన్ రామ్ నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. అనంతరం పలువురు దళిత సంఘ నాయకులకు మంత్రి గంగుల కమలాకర్ తన చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నా రాజకీయ జీవితంలో మహానుభావులైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లు జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండలేదన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితభందు పథకాన్ని చేపట్టారని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. కరీంనగర్ నగరంలోని ఇద్దరు మహనీయుల విగ్రహాల హైలాండ్ జంక్షన్ లను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. దళిత జాతి కోసం నగరంలో ఒక ఎకరా స్థలంలో రూ.8కోట్ల నిధులతో అద్భుతమైన అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేసినట్లు తెలిపారు. త్వరలోనే అందరి సమక్షంలో అంబేద్కర్ భవనాన్ని ప్రారంభం చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజలు మూడుసార్లు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వారి రుణం తీర్చుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో సంక్షేమం అభివృద్ధి పథకాలతో ఆనందం ఇలాగే కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు ఇంకా మా చేతులు బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ రెడ్డి మధు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొబ్బరికాయ కొడుతున్న మంత్రి గంగుల కమలాకర్
రిపేర్, రేనోవేషన్ కు పనులను ప్రారంభించిన మంత్రి గంగుల

కరీంనగర్ లోని స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ పక్కన డ్రైవర్ అసోసియేషన్ బిల్డింగ్ రిపేర్, రేనోవేషన్ కు రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కాన్సెటన్సీ డెవలప్మెంట్ ఫండ్ సీడీపీ నుంచి రూ.10లక్షలు ఇచ్చారు. ఈ సందర్భంగా రిపేరు, రేనోవేషన్ పనులను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం మంత్రిని కరీంనగర్ జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు వారిని మర్యాద పూర్వకంగా శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా హరిశంకర్ స్వరూప రాణి, టీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మంజీత్ సింగ్, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, టీఎన్జీవోల సంఘం జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, జిల్లా నాయకులు రమేష్ గౌడ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి నరసింహ రెడ్డి, డ్రైవర్ సంఘం బాధ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


