Monday, January 13, 2025

ఆరోగ్యశ్రీ స్థానంలో ఇన్సూరెన్స్…

- Advertisement -

ఆరోగ్యశ్రీ స్థానంలో ఇన్సూరెన్స్…

Insurance in place of Arogyashri...

విజయవాడ, జనవరి 6, (వాయిస్ టుడే)
ఆరోగ్యశ్రీ కన్నా మెరుగైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకువస్తుంది కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆరోగ్య శ్రీ కంటే ఎలా మెరుగైందో చెప్పాలంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ వల్ల ప్రభుత్వ ఖజానా పై భారం పడుతుంది. ప్రయివేటు ఆసుపత్రులకు కోట్ల రూపాయల నిధులను చెల్లించాల్సివస్తుంది. ఏటా వందల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే దీనికి విరుగుడుగా ఆరోగ్య శ్రీని ఎత్తివేసి ఎన్టీఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలుచేయాలన్న ఆలోచనను చేస్తుంది. అయితే దీనిని ప్రయివేటు ఆసుపత్రులతో పాటు బీమా కంపెనీలు కూడా ఏ మేరకు సహకరిస్తాయన్నది మాత్రం అనుమానంగానే ఉంది. సహజంగా బీమా అంటేనే పూర్తి స్థాయిలో డబ్బులు రావు.అయితే బీమా సౌకర్యం ఉంటే ముందు చికిత్స ప్రారంభిస్తారు. అలాగే ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నప్పటికీ అదే తరహాలో చికిత్సను ప్రారంభిస్తారు. అయితే ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందితే ఆ సొమ్మును ప్రభుత్వం ఆ ఆసుపత్రికి అందచేయాల్సి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం దుర్వినియోగం అయినట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి. వైద్యం అందించకుండానే దొంగ బిల్లులు పెట్టి అనేక ఆసుపత్రులు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. దీనిని అరికట్టేందుకు బీమా సౌకర్యం ఒకరకంగా మేలు చేస్తుందన్నది వాస్తవమే. ఎందుకంటే బీమా కంపెనీలు కేవలం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తే చాలు వైద్యానికి అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. దాదాపు ఎనభై శాతం డబ్బులు చెల్లించే బీమా కంపెనీలున్నాయి. అయితే కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే బీమా సౌకర్యం లభిస్తుంది. ఆసుపత్రి యాజమాన్యాలు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేయడం కూడా ఒకింత ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఒక కోటి 43 లక్షల కుటుంబాలు ఉన్నాయి వీరందరి తరుపున కూటమి ప్రభుత్వమె హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంది. ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షల వరకు లబ్ది చేకూరుతుంది .అంతకు మించితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మిగిలిన మొత్తం చెల్లిస్తుంది. దీని వల్ల లబ్దిదారుడికి ఒక్క రూపాయి కూడా అదనంగా పడదని చెబుతుంది. ప్రెవేట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేవారికి ఇటువంటి సదుపాయాలు వస్తాయో అంతకుమించి ప్రయోజనాలు కూటమి ప్రభుత్వం కలిస్తుంది. గత ప్రభుత్వంలో వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కి సంబంధించిన నెట్ వర్క్ హాస్పిటల్స్ కి వెళ్తే చికిత్స అంత తొందరగా చేసేవారు కాదు ప్రభుత్వం నుంచి వారికి డబ్బులు అంతో ఇంతో పడితేనే చికిత్స చేసేవారు ఈ విధానినికి స్వస్తి చెప్పామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.. ప్రజలకు కావాల్సింది మెరుగైన వైద్యం, విద్య ఇవ్వన్నీ కూటమి ప్రభుత్వం చేస్తుందని అధికార పార్టీ చెబుతున్నప్పటికీ బీమా అనగానే ప్రజల్లో ఒకరకమైన ఆందోళన నెలకొంది. దీంతో పాటు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొన్ని బీమా కంపెనీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలా బీమా సౌకర్యం ఏర్పాటు చేయడంలోనూ అనేక ఇబ్బందులున్నాయి. బీమా మొత్తం కంపెనీ చెల్లించడానికి నిరాకరిస్తే ఆ మొత్తాన్ని ఆసుపత్రి యాజమాన్యం రోగి బంధువుల నుంచి వసూలు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మొత్తం మీద ఆరోగ్య శ్రీని ఎత్తివేసి దాని స్థానంలో బీమా సౌకర్యం కల్పించడంలో కొంత సర్కార్ ఖజానాకు చిల్లు పడే అవకాశం తప్పుతున్నా ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. దీనిని అమలు చేస్తే గాని దానిలోని లోపాలు, లొసుగులు బయటకువచ్చే అవకాశం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్