Sunday, September 8, 2024

నవంబర్ 14 లోపు ఇంటర్ ఫీజు చెల్లించాలి

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీలను విడుదల చేసింది ఇంటర్ బోర్డు. నవంబర్‌ 14వ తేదీ వరకు ఫీజు గడువును నిర్ణయించింది. రూ.100 జరిమానాతో నవంబర్ 16వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. రూ.500 ఫైన్ తో నవంబర్ 25 వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు.. రూ.1000 జరిమానాతో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫీజు కట్టవచ్చని వెల్లడించింది.రూ.2 వేల జరిమానాతో డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మొదటి సంవత్సరం విద్యార్థులు(రెగ్యూలర్) రూ. 510, ఒకేష‌న‌ల్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 730, రెండో ఏడాది ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, ఒకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాల‌ని వెల్లడించింది.తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరీక్షలతో పాటు సిలబస్ కు సంబంధించి పలు మార్పులు తీసుకొచ్చిన బోర్డు…. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించే ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫలితంగా ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థులు ఇకపై ఒక ఇంటర్నల్ పరీక్షను మాత్రమే రాయాల్సి ఉంటుంది.గతంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రెండు ఇంటర్నల్స్ పరీక్షలు రాయాల్సి ఉండేది. ఇందులో ఒకటి ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ ఉండగా… మరోకటి ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పేపర్ ఉండేది. అయితే ఈ ఏడాది నుంచే ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ను తీసుకొచ్చారు.

Inter fee should be paid by November 14
Inter fee should be paid by November 14

దీంతో ఒక ఇంటర్నల్ పేపర్ ను తొలగించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో విలీనం చేయడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇక ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను యథాతథంగా ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష కేవలం క్వాలిఫైయింగ్‌ పేపర్‌ మాత్రమే. ఈ మార్కులను రెగ్యులర్‌ మార్కుల్లో కలపరు.ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉండగా…. 80 మార్కులకు థియరీ, 20 మార్కులు ప్రాక్టికల్స్ కు ఉంటాయి. విద్యార్థులు రికార్డు కూడా రాయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఇంగ్లీష్ కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రైవేటు రంగాల్లో అవకాశాలు రావాలంటే ఇంగ్లీష్ రావాల్సిందే. విషయంపై అవగాహన ఉన్న… ఇంగ్లీష్ రాకపోవటంతో చాలా మందికి అవకాశాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ స్థాయిలోనే ప్రాక్టికల్స్ దిశగా విద్యార్థులను అడుగులు వేసేలా ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. నూతన విధానం ప్రకారం ఇంటర్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు ల్యాబ్‌ వర్క్‌ తప్పనిసరి కానున్నది. ఫలితంగా అన్ని కాలేజీల్లో ఆంగ్ల ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఈ విధానం ఇంజినీరింగ్ కాలేజీల్లో అమలవుతోంది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా తరగతి గదిలో విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడిస్తారు. ఈ ప్రాక్టికల్స్ లో ప్రధానంగా వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలను పెంచుకోనేలా సాధన చేయిస్తారు. మాట్లాడినవి రికార్డు చేయటం వంటివి చేస్తారు. భాషా సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్