- Advertisement -
డ్యాన్స్ చేస్తూ ఇంటర్ విద్యార్దిని గుండెపోటుతో మృతి
Inter student died of heart attack while dancing
మహబూబాబాద్
సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి విద్యాద్దులకు వీడ్కోలు కార్యాక్రమంలో విషాదం నెలకొంది. స్కూల్లో మంగళవారం రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన సపావట్ రోజా (16)ఇంటర్ .. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఒక్క సరిగా శోక సంద్రం లో మునిగిపోయారు
- Advertisement -