- Advertisement -
ఇంటర్ విద్యార్దిని మృతి
Inter student dies
పెనమలూరు
తాడిగడప 100 అడుగుల రోడ్లో శ్రీ చైతన్య కళాశాల సరస్వతి భవన్ లో ఇంటర్ విద్యార్థి మృతి చెందింది. మృతురాలి బంధువులు మాట్లాడుతూ తమ పిల్లలకు ఎటువంటి అనారోగ్యం లేదు. తమ పిల్ల ఎందుకు చనిపోయిందో పోలీసులు, కాలేజీ యాజమాన్యం బయటపెట్టాలి. మృతురాలు తండ్రి ఆర్ఎస్ఎస్ సభ్యుడు. పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మ ఇప్పటికే బంధువులతో ఫోన్లో పరామర్శించారు. పవన్ కళ్యాణ్ మోడీ పర్యటనలో ఉన్నందున పవన్ కళ్యాణ్ కి విషయం తెలియజేస్తానని హామీ ఇచ్చారు.
ఏబీవీపీ నాయకుడు గోపి మాట్లాడుతూ లాంగ్ టర్మ్ కోసం కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి డాక్టర్ అవ్వకుండానే శవమై విద్యార్థి తిరిగివెళుతుంది. తెలంగాణ తరహాలో ఇక్కడ కూడా శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై మహిళా కమిషన్, మరియు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని అన్నారు.
కార్పొరేట్ మాయలో తల్లిదండ్రులు విద్యార్థులను ఒకచోట బంధించి ఉంచే హాస్టల్స్ లో బలిపశువులను చేస్తున్నారని, ఇకనైనా తల్లిదండ్రులు ఆలోచించాలని.. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి తమ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -