Thursday, January 15, 2026

ఆసక్తికరంగా “కర్మణ్యే వాధికారస్తే” టీజర్

- Advertisement -

ఆసక్తికరంగా “కర్మణ్యే వాధికారస్తే” టీజర్

Interesting teaser of “Karmanye Vadhikaraste”

వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం “కర్మణ్యే వాధికారస్తే”.

ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ చిత్రం యొక్క కథాంశం.

అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే తన దర్శకత్వ శైలితో ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించారు. గ్యానీ సంగీతం సమకూర్చారు. కథ- సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు. శత్రు, బ్రహ్మాజీ, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించగా…పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా దయానంద్ రెడ్డి ఈ చిత్రం తో పరిచయమవుతున్నారు.

విశాఖపట్నం, హైదరాబాద్ లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రసాద్ ఫిలిం ల్యాబ్,  సారధి స్టూడియోస్ లో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా ఈ విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి టీజర్ విడుదలై ఆద్యంతం ఉత్కంఠభరితంగా నిలిచి చిత్రం పై మరింత ఆసక్తిని రేకెత్తించింది.

నటి నటులు: బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్(నూతన పరిచయం). ఇరా దయానంద్(నూతన పరిచయం), అయేషా(నూతన పరిచయం), రెహానా ఖాన్(నూతన పరిచయం), జయ రావు, బాహుబలి మధు, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్