- Advertisement -
మధ్యంతర బడ్జెట్ సమగ్రమైనది, వినూత్నమైనది
మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..
న్యూ డిల్లీ ఫిబ్రవరి 1
;కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించిన మధ్యంతర బడ్జెట్ 2024-25పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మధ్యంతర బడ్జెట్ సమగ్రమైనదని, వినూత్నమైనదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగుతుందనే విశ్వాసాన్ని కల్పిస్తోందని అన్నారు. విక్‌సిత్ భారతానికి 4 స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను ఈ మధ్యంతర బడ్జెట్ శక్తివంతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలపడానికి హామీ ఇస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
- Advertisement -



