Sunday, September 8, 2024

మత్తు పదార్థాలు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

Intoxicants Awareness of students on cyber crimes :

మత్తు పదార్థాలు సైబర్ నేరాలపై  సిటిజన్ స్కూల్ విద్యాయూర్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించిన

సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్

సిద్దిపేట
ఈ సందర్భంగా టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ. గంజాయి ఇతర మత్తుపదార్థాలకు  దూరంగా ఉండాలని ఒకసారి అలవాటు పడితే జీవితాలు దుర్భరంగా మారుతాయని  చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు ఎవ్వరూ బానిస కావద్దని,  తల్లిదండ్రుల పడుతున్న కష్టాన్ని చూసుకుంటూ చదువుకోవాలని సూచించారు.
మనిషి మనుగడకు చదువు చాలా ముఖ్యమని  చదువుకుంటే ఎక్కడైనా ఏ ప్రదేశం లోనైనా బతకవచ్చని తెలిపారు. మీరు ఉంటున్న ప్రదేశంలో కానీ మీకు తెలిసిన వారు కానీ  ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు కానీ  అమ్ముతున్నట్లుగానే తెలిస్తే వెంటనే స్కూల్ యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు  ఈ మధ్యకాలంలో  కొరియర్ల పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి  వాటిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పేర్కొన్నారు.
లోన్ యాప్,లాటరి, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో   సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి. చాలా ముఖ్యమని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేసినచో అమౌంటు ఫ్రిజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్  నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు. నకిలీ లాటరీలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు, లోన్ యాప్ ,పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ శ్రీజ, బాలకృష్ణ హరి అకాడమిక్ ఇంచార్జ్ సుధాకర్, విద్యార్థినీ విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్