_*ఫేస్ బుక్ లో పరిచయం…*_
_*ఆతరువాత ప్రేమ… అటుపై ప్రణయం*_
_*కన్నవారిని వదిలి ప్రియుడి వద్దకు పయణం…*_
_*నంద్యాల టు వెలిగండ్ల..*_
_*10 నెలలుగా సహజీవనం…*_
_*ప్రియుడి వేదింపులు తాళలేక తిరుగు ప్రయాణం….*_
_*పొదిలి ఆర్టిసి బస్టాండ్లో సంఘటన*_
_ఆర్టిసి బస్టాండ్ లో ఇరువురు ఘర్షణ… బలవంతంగా ప్రియుడు ఇంటికి తీసుకపొయే ప్రయత్నం…_
_అడ్డుకున్న ఆర్టిసి సిబ్బంది, ప్రయాణికులు… పొలీసులకు సమాచారం…_
_ప్రకాశంజిల్లా దరిశి మండలం బండి వెలిగండ్ల గ్రామానికి చెందిన ఒక యువకిడికి పేస్ బుక్ లో నంద్యాల పట్టణానికి చెందిన యువతి పరిచయమైంది…_
_అతురువాత ఇరువురి మనస్సులు కలిసాయి, ప్రేమ ప్రణయంగా మారింది.._
_తల్లిదండ్రులను వదిలి ప్రియుడి కొసం బండి వెలిగండ్ల గ్రామానికి వచ్చింది.._
_అతనితో సహజీవనం ప్రారంభించింది రొజులు గడిచే కొద్ది యువకుడి అసలు రంగు బయట పడింది మద్యానికి బానిసై తనను రొజు వేదింపులకు దిగాడు.._
_ప్రియుడితో విసుగొచ్చిన ప్రియురాలు అతనితో ఇక కుదరదని గ్రామం నుంచి సొంత పట్టాణానికి వెళ్ళాలని పొదిలి ఆర్టిసి బస్టాండ్ కు చేరుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు అడ్డుకొని ఘర్షణ పడ్డారు._
_బస్టాండ్ లో ఘర్షణ చొటు చేసుకొవడం తో ఆర్టిసి సిబ్బంది,ప్రయాణికులు అడ్డుకొని పొలీసులకు సమాచారం అందించారు.._
_రంగంలోకి దిగిన పొలీసులు ఇరువురిని విచారించి యువతిని సొంత పట్టణానికి పంపించారు. ప్రియుడిని ఇంటికి పంపించారు._




