తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..

- Advertisement -

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..

Investigation on Tirumala Laddu Adulteration Controversy..

స్వతంత్ర సిట్ కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ
తిరుమల లడ్డూ వివాదంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ తో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. కొనసాగాలా లేక సిట్ విచారణపై తమకు ఎలాంటి సందేహాలు లేవు అని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అయితే, సిట్పై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయన వాదనతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం స్వతంత్ర దర్యాప్తు జరిగితే మంచిదేనని అభిప్రయాపడింది.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో  దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉండాలని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular