
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మర్వాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరగనున్న తన చిన్న కుమారుడి వివాహనికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ప్రగతిభవన్‌కు తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన బ్రహ్మానందం.. ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే తాను స్వయంగా రెడీ చేసిన తిరుమల శ్రీవారి డ్రాయింగ్ కానుకగా అందించారు. అనంతరం.. బ్రహ్మానందం కుటుంబంతో కాసేపు సీఎం ముచ్చటించి పెళ్లి కబర్లు తెలుసుకున్నారు. బ్రహ్మానందంతోపాటు ఆయన సతీమణి.. పెద్ద కొడుకు గౌతమ్ ప్రగతి భవన్లో సీఎంను కలుసుకున్నారు. బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం మే 21న ఐశ్వర్య అనే అమ్మాయితో జరగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హజరరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు.