- Advertisement -
హైదరాబాద్: ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వాట్సప్ వీడియో కాల్ రావడంతో సదరు అధికారి ఎత్తారు. ఓ మహిళ నగ్నంగా దర్శనమివ్వడంతో వెంటనే కట్ చేశారు. కానీ ఈలోపే ఆ కాల్‌ను రికార్డు చేసి, డబ్బులివ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగడంతో.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
- Advertisement -


