- Advertisement -
మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం..మండలిలో మంత్రి పొన్నం
Iron foot on drugs..Minister Ponnam in the council
హైదరాబాద్
శాసన మండలి లో డ్రగ్స్, హుక్కా సెంటర్లు తదితర వాటిపై ఎమ్మెల్సీలు బలమురి వెంకట్ , ఎం ఎస్ ప్రభాకర్ రావు లు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానాలు ఇచ్చారు. హుక్కా సెంటర్లను నిహేధిస్తు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సి2పిఎ సెంట్రల్ యాక్ట్ పై ఇప్పటికే ప్రెసిడెన్షియల్ కి పంపించడం జరిగింది. 12 హుక్కా పార్లాల్ లు హైకోర్టు అనుమతి తీసుకొని నడుపుతున్నాయి. ఎవరికి కూడా వదలడం లేదు. రాజకీయ ,సినీ ప్రముఖులు ఎవరు చట్టం నుండి వదిలేదు లేదని అన్నారు.
నార్సింగి ఫిల్మ్ యాక్టర్ కి సంబంధించిన కేసు నడుస్తుంది. గచ్చిబౌలి లో కొకైన్ కి సంబంధించిన కేసు నడుస్తుంది. మొకిలా లో కొకైన్ కి సంబంధించిన కేసు నడుస్తుంది. ఫాం హౌజ్ లలో పార్టీలు చేయకున్నప్పుడు అనుమతి తీసుకోవాలి. తెలంగాణ లో మద్యపాన నిషేధం లేదు.. పార్టీలలో మద్యం అనుమతి తీసుకొని డిడి చెల్లించి పార్టీలు చేసుకోవాలి. పార్టీల పేరుతో డ్రగ్స్ అశ్లీలత ఉంటే చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కాలేజి లు పాఠశాలల పై నిరంతర నిఘా ఉంచాం. పలు కాలేజీలకు నోటిసులు జారి చేశాం డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. పలు పాఠశాలల్లో కేసులు నమోదు చేశాం. పబ్ లలో డ్రగ్స్ గంజాయి దొరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ పై కుటుంబాలు నాశనం అవుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా పాలించిన వారు డ్రగ్స్ లై ఉక్కుపాదం మోపితే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
గ్రామాల్లో కూడా డ్రగ్స్ పాకుతుంది.. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నాం . సినీ ప్రముఖులు ,రాజకీయ నాయకులు డ్రగ్స్ ఇతర కేసుల్లో ఎంత పెద్దవారు ఉన్న వదిలేది లేదని అన్నారు.
- Advertisement -