బిజెపి సీనియర్ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
కూకట్పల్లి : అక్టోబర్ 31(వాయిస్ టుడే): కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ వార్డ్ ఆఫీస్ ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను మంగళవారం బిజెపి సీనియర్ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోబడుతుందని, భారత తొలి హోమ్ మంత్రి గా సేవలందించడం జరిగిందని, ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్, జూనాగడ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం అవ్వడానికి ముఖ్య కారకులు అదేవిధంగా జాతీయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, యంజాల పద్మయ్య, పిట్ల మనోహర్, తూము శైలేష్, కిషోర్, శివరాజ్ యాదవ్, మైసయ్య, శంకరయ్య, రవి గౌడ్, కొల్లి వెంకట్, ప్రశాంత్, దోమశీను, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



