Tuesday, April 29, 2025

టీడీఆర్ బాండ్స్ లో అవకతవకలు

- Advertisement -

టీడీఆర్ బాండ్స్ లో అవకతవకలు

Irregularities in TDR Bonds

తిరుపతి, నవంబర్ 25, (వాయిస్ టుడే)
తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత వెలిసిన నగరం.. ప్రతి రోజు లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. తిరుపతి అభివృద్ధికి ఏ ప్రభుత్వం వచ్చినా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ఈ నగరానికి ఏమైంది. అన్నట్లు తయారైంది పరిస్థితి.. 5 సంవత్సరాలు అడ్డగోలు నిర్ణయాలతో, పాలకుల ఓంటెద్దు పోకడతో తిరుపతి సిటీ స్థాయి దిగజారింది. ప్రజల సమస్యల పరిష్కారానికంటే తమ సొంత లాభం కోసం ప్రజా ప్రతినిధులు పనిచేశారన్న ఆరోపణలున్నాయి.కార్పోరేషన్ కు జరిగిన ఎన్నికలలో ప్రతిపక్షం గెలవ కూడదని.. అప్పటి వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రత్యర్థులతో అసలు నామినేషన్లు కూడా వేయనివ్వలేదు.. వేసిన చోట బెదిరించి మరీ ఉపసంహరింప చేసి ఏకగ్రీవం చేసారు. కొన్నిచోట్ల నామినేషన్లు అనర్హత వేటుతో అడ్డు తొలగించారు.. తర్వాత మేయర్‌ను కేవలం కీలుబొమ్మగా మార్చి అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి , అయన కూమారుడు అభినయ్‌రెడ్డిలు చక్రం తిప్పారని పెద్ద ఎత్తున అరోపణలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విదంగా ఇద్దరు డిప్యూటీ మేయర్ల సంసృతి వైసీపీ పాలనలో ప్రారంభమైంది. అందులో దులో బాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శీరిష మేయర్‌గా ఎంపిక కావడంతో డిప్యూటీ మేయర్‌గా మొదట ముద్ర నారాయణను ఎంపిక చేసారు. తర్వాత ఎమ్మెల్యే కూమారుడు భూమన అభినయ్ రెడ్డి రెండవ డిప్యూటీ అయ్యాడు. అప్పటికే పాలక వర్గం మొత్తం అభినయ్ కనుసన్నలలో నడుస్తుంది. తర్వాత అతను డిప్యూటీ మేయర్ కూడా కావడంతో మేయర్ పూర్తిగా డమ్మి అయ్యారు.పాలకమండలి సమావేశాలలో మేయర్ మాత్రమే ఉన్నతాసనంలో కూర్చోవాల్సి ఉండగా.. తిరుపతిలో మాత్రం ఎమ్మల్యే, కమిషనర్ కూడా సభ్యులకు ఎదురుగా వేదిక మీద ఉండేవారు.. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎక్కడా లేని ఆ సంప్రదాయానికి తెర దించారు. మేయర్ మాత్రమే సభ్యుల ఎదురుగా కూర్చొనేలా చర్యలు తీసుకున్నారు.ఆ క్రమంలో జూపార్క్ రోడ్ లో టూరిజం శాఖ ముంతాజ్ హోటల్ కు అనుమతి ఇచ్చింది. ఎస్వీ యూనివర్సిటి మధ్య నుంచి ఆ హోటల్ వరకు రహదారి వెళ్ళే విధంగా నగర పాలక సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించి పనులు ప్రారంభించాలని చూసింది. అయితే విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో వారిని అణచి వేయడానికి ప్రయత్నించారు. అయితే పూర్వ విద్యార్థులు కోర్టుకు వెళ్ళడంతో పాటు స్థానిక ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. చివరి వరకు ఎస్వీ యూనివర్సిటిలో రహాదారులు వేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇది అప్పటి పాలక మండలికి తగిలిన మొదటి దెబ్బ అని చెప్పవచ్చు.ముంతాజ్ హోటల్ వ్యవహారంతో మొదటి సారిగా వైసీపీ నాయకుల పై తిరుపతిలో బహిరంగంగా వ్యతిరేకత కనిపించింది. తర్వాత బలవంతంగా తిరుపతి చుట్టు పక్కల మాస్టర్ ప్లాన్ రహదారుల పనులు ప్రారంభించారు. వాటికి సంబంధించి టీడీఅర్ బాండ్స్ ఇష్యూతో రాష్ట వ్యాప్తంగా నగర పాలక సంస్థ పరువు గంగలో కలసి పోయింది. టీటీడీ పాలకమండలిలో సైతం చక్రం తిప్పిన భూమన.. టీటీడీ నిధుల్లో ఒక శాతం తిరుపతి లో స్కావెంజర్స్ నియామాకానికి ఇవ్వాలని పాలక మండలిలో తీర్మానం చేసినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు పాలయ్యారు. ఆ సందర్బంగా తమ మందిమాగదుల ద్వారా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేయించుకోవడానికి ప్రయత్నించి మరింత అభాసు పాలయ్యారు.అయితే తాము అనుకున్నవన్నీ చేయడానికి.. తమకు అనుకూలమైన సిబ్బందిని తెచ్చుకున్నారు. గతంలో విశాఖ తో పాటు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పనిచేసిన వివాదాస్పద అధికారిని డిప్యూటేషన్ మీద తెప్పించుకుని మాస్టర్ ప్లాన్ రహాదారుల దందా చేయించారు. అదే విదంగా పుంగనూరు, కుప్పంలో పనిచేసిన వివాదాస్పద అధికారి వర్మను సైతం తిరిగి తెప్పించుకున్నారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమషనర్‌లను ఏరికోరి నియమించుకున్నారు. వీరందరి సాయంతో ఓటర్ల జాబితా ను సైతం అడ్డగోలుగా మార్చి వేసారు.స్మార్ట్ సిటీ నిధులను మంచి నీళ్ళలా ఖర్చు పెట్టారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. నిబంధనలు తుంగలో తొక్కి కపిల తీర్థం సర్కిల్‌లో ట్రాఫిక్ కు ఇబ్బంది అయినప్పటికి నిర్మించిన హోటల్.. స్మార్ట్ సిటీ నిధులు సుమారు 2కోట్లకు పైగా ఖర్చు పెట్టి విలాసవంతమయిన హోటల్ నిర్మింప చేసిన భూమన తన అనుచరుడుడికి లీజుకు ఇచ్చారు. అయితే మారిన ప్రభుత్వం కూడా ఎందుకో దాని పైన చర్య తీసుకోలేదు..ఇలాంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున గత ఐదు సంవత్సరాలలో నడిచాయంట.మాజీ ప్రజా ప్రతినిధులకు సహాకరించిన అదికారులపై గత మూడు నెలలుగా విజిలెన్స్ తో పాటు శాఖ పరమైన విచారణ కొనసాగుతుంది. గత వారంలో మూడు రోజుల పాటు అనంతపురం రీజనల్‌ డైరెక్టర్‌ విశ్వనాథ్‌ నేతృత్వంలో మూడు బృందాలు తిరుపతిలో విచారణ చేపట్టాయి. ఆ తర్వాత మళ్లీ తిరుపతికి చేరుకున్న విచారణ బృందం తమ పని చేసుకుపోతోంది. ఇటీవల బదిలీ అయిన రెవెన్యూ అధికారి కేఎల్‌ వర్మ, మేనేజర్‌ చిట్టిబాబు, డీఈ విజయకుమార్‌ రెడ్డిపై అక్రమ ఆరోపణలపై లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.వైసీపీ ప్రభుత్వంలో పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌గా కూడా పనిచేసిన వర్మ అవకతవకలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే విచారణ కమిటీ బృందంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది. అయితే ఆర్డీ విశ్వనాథ్‌ ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుండడంతో విచారణ ఎదుర్కొంటున్న వారి ఎత్తులు పారడం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో విచారణ పూర్తికానుందని, నివేదికను డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేయనున్నట్టు సమాచారం.ఓ వైపు శాఖ పరమైన విచారణ.. మరో వైపు విజిలెన్స్ విచారణ జరగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ అధికారులు భయపడుతున్నారంట. తాము ఊడిగం చేసిన వార అధికారం కోల్పోవడంతో.. తమను బయటపడేసే వారి కోసం అమరావతి చుట్టు తిరుగుతున్నారంట. మొత్తం మీద పాపాలకు సహాకరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం కూడా తిరుపతిలో వైసీపీ నేతల పెత్తనమే నడుస్తుండటంపై టీడీపీ కేడర్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ప్రస్తుత కార్పొరేషన్ కమిషనర్‌పై అధికార పార్టీ వర్గాలు ఇన్చార్జ్ మంత్రికి ఫిర్యాదు చేశాయి. అయితే ఇంత వరకు ఆయన్ని బదిలీ చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తిరుపతి అక్రమాలపై సీరియస్‌గా దృష్టి పెట్టకపోతే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలన్నీ గంగలో కలిసిపోతాయని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్