- Advertisement -
సాగునీటి సంఘము ఎన్నికలు ఏకగ్రీవం
Irrigation Society elections are unanimous
బేతంచెర్ల
: బేతంచెర్ల మండల పరిధిలోని గొర్లగుట్ట గ్రామంలో శనివారం సాగునీటి సంఘము ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారి ఫజుల్ రహిమాన్,తహశీల్దార్ ప్రకాష్ బాబు,ఎన్నికల పర్యవేక్షణ అధికారి ఇరిగేషన్ డిఈ మల్లికార్జునరెడ్డి,తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం ఓట్లు 92 ఉండగా అందులో 6 మంది మరణించినట్లు తెలిపారు.ఎన్నికల కేంద్రంను డోన్ ఆర్డీఓ నరసింహులు పరిశీలించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు. అయితే అందరి ఆమోదంతో గ్రామ పెద్దల సమక్షంలోఎన్నికలు ఏకగ్రీవంగా జరినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.సాగునీటి సంఘము చైర్మన్ గా లింగాల పద్మనాభం,ఉప చైర్మన్ పెద్ది సావిత్రిలు ఏకగ్రీవంగాఎన్నిక కాగా సభ్యులుగా ఆల నాగిరెడ్డి,బండికారి ఆదిలక్ష్మి, బోళ్లవరం సుబ్బలక్ష్మమ్మ,దాదాగళ్ళ రాజమ్మ,లు సభ్యులుగాఎన్నికయినట్లుతెలిపారు . ఎన్నికలలోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాసిఐ డి.వెంకటేశ్వరరావు,ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలోగట్టి పోలీస్ బంధబస్తు నిర్వహించారు.
- Advertisement -