Thursday, January 16, 2025

అవినాష్  బండారం బయిట పడినట్టేనా

- Advertisement -

అవినాష్  బండారం బయిట పడినట్టేనా

Is Avinash booked

కడప, జనవరి 9, (వాయిస్ టుడే)
ఎంపీ అవినాష్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? పోలీసుల విచారణలో పీఏ రాఘవరెడ్డి గుట్టు విప్పేడా? బండారం మొత్తం బయట పెట్టేసి నట్టేనా? ఈ కేసులో అవినాష్‌కు చిక్కులు తప్పవా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వ్యక్తులు ఇలా అందర్నీ వినియోగించుకుంది వైసీపీ. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. సోషల్ మీడియా కేసులో రేపు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.రీసెంట్‌గా మంగళవారం మధ్యాహ్నాం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. ఒకానొక దశలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.న్యాయస్థానం రాఘవరెడ్డికి ముందస్తు బెయిల్ తోసిపుచ్చింది. వెంటనే రంగంలోకి దిగేశారు పోలీసులు. సాయంత్రం అయినా రాఘవరెడ్డి పోలీసులు విడుదల చేయక పోవడంతో అరెస్ట్ చేశారని వార్తలు జోరందుకున్నాయి. చివరకు రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు అతడ్ని విడిచిపెట్టారు. మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసుల  విచారణలో రాఘవరెడ్డి ఏం చెప్పాడు? విషయాలు చెప్పకుంటే ఎందుకు రాత్రి 9 గంటల తర్వాత విడుదల చేశారు? ఇదే భయం ఎంపీ అవినాష్‌రెడ్డిలో మొదలైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నిజం చెబితే తాను ఎక్కడ ఇరుక్కుంటోనని బెంబేలెత్తుతున్నాడని కడప వైసీపీ నేతల మాట.రాఘవరెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్‌రెడ్డితో మాట్లాడేందుకు జిల్లాకు చెందిన పార్టీ నేతలు కొందరు వెళ్లారట. పెద్దగా ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడలేదని, ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నారని అంటున్నారు. ఈ లెక్కన అవినాష్ కు టెన్షన్ మొదలైందని అంటున్నారు.రాఘవరెడ్డి పోలీసుస్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా అవినాష్ రెడ్డికి దగ్గరకు వెళ్లాడట. స్టేషన్‌లో జరిగిదంతా పూసగుచ్చి మరీ చెప్పాడని అంటున్నారు. పోలీసులు ప్రశ్నించిన అన్ని విషయాలు చెప్పాడా? అసలు మేటర్ దాచాడా?అన్నదే ఆసక్తికరంగా మారింది.ఈ కేసు ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్రా రవీందర్‌రెడ్డిని నవంబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కడప జైలులో ఉంటున్నాడు.భార్గవరెడ్డి సూచనల మేరకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రాఘవరెడ్డి నుంచి తనకు కంటెంట్ వచ్చేదని చెప్పాడు. వెంటనే అతడ్ని నిందితుడి గా పేర్కొన్న విషయం తెల్సిందే. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు రాఘవరెడ్డి. కడప న్యాయస్థానం చివరకు హైకోర్టుని ఆశ్రయించినా ఆయనకు ఊరట దక్కలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్