Sunday, September 8, 2024

గులాబీ నేతల వ్యూహాత్మక మౌనమేనా

- Advertisement -

గులాబీ నేతల వ్యూహాత్మక మౌనమేనా
కరీంనగర్, మే 28  (వాయిస్ టుడే)
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తరువాత.. బీఆర్ఎస్‎లో సైలెంట్ కనబడుతుంది. ఎక్కడా హడావిడి కనబడటం లేదు. నేతలు కూడా.. ఎన్నికల పోలింగ్ గురించి పెద్దగా చర్చించడం లేదు. అయితే, రెండు నియోజకవర్గాలు మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వలేమన్న భావన కనబడుతుంది. దీంతో ఇక్కడ ఫలితం ఏ విధంగా వస్తుందో ఉత్కంఠ నేతల్లో కనబడుతుంది. కరీంనగర్ పరిధిలో బీఆర్ఎస్ అవిర్చావం నుంచి 2018 ఎన్నికల వరకు హడావిడి కనిబడింది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‎కి ఉహించని షాక్ తగిలింది. అప్పటి నుంచి వరుసగా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గట్టి షాక్ తగిలింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిందుకు ప్రయత్నం చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలోకి దిగారు. రెండు నెలల పాటు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా గెలువలనే పట్టుదలతో ముందుకు సాగారు. బిజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్రావు పోటీ చేశారు. అయితే పోలింగ్ తమకు అనుకూలంగా లేదని నేతల్లో చర్చ సాగినట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్య నేతలు ఈ విషయం గురించి పెద్దగా చర్చించడంలేదు. వినోద్ కుమార్ కూడా పూర్తిగా పోలీంగ్‎పై సమీక్ష నిర్వహించేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. బలమైన నేతలు ఉన్నప్పటికీ గట్టిగా పోటీ ఇవ్వలేకపోయామనే భావన వ్యక్తమైంది.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాల్లోనే, బీఆర్ఎస్‎కి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కరీంనగర్ అసెంబ్లీలో కూడా అనుకున్న స్థాయిలో ఓట్లు బీఆర్ఎస్‎కి రాలేదనే చర్చ సాగింది. పోలింగ్‎కు ముందు చొప్పదండి, సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, హంజారాబాద్లో మెజారిటి ఓట్లు వస్తాయని నేతలు భావించారు. అందుకు విరుద్ధంగా పోలీంగ్ సరళి కనబడింది. హుస్నాబాద్లో, కాంగ్రెస్, బిజెపీ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. అదే విధంగా, మానకొండూరు, చొప్పదండిలో బిజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు కనబడింది. దీంతో అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్‎కు ఓట్లు రాలేదని నేతల్లో అభిప్రాయం ఏర్పాడినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఎన్నికల తర్వాత నుంచి ముఖ్య నేతలంతా సైలెంట్ ఆయ్యారు. అయితే సైలెంట్ ఓట్లు తమను గట్టెక్కిస్తాయనే ధీమాతో ఉన్నారు. వినోద్ కుమార్ కూడా మీడియా చిట్ చాట్‎లో మోదీ వేవ్ కనబడిందని ప్రస్తావించారు. అయితే పోరాటం చేసే బీఆర్ఎస్‎కి ప్రజల మద్దతు ఉందని చెబుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉండటంతో తమకే లాభం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో నివేదికలు ప్రతికూలంగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు బలంగా ఉన్న సమయంలోనే వినోద్ కుమార్ ఓడిపోయారు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితిల్లో ఎలాంటి ఫలితం వస్తుందనే ఉత్కంఠ నేతల్లో కనిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్