ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..?

- Advertisement -

ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..?
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ అక్రమ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్
హైద‌రాబాద్ సెప్టెంబర్ 5

Is public governance a matter of suffocating those who ask questions..?

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..? అని కేటీఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోంది. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిన బుద్ధి రాలేదు. ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు.అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చునుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత మంది పుట్టుకొస్తారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదు. నిరంకుశ పాలన సాగుతోంద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular