Monday, December 23, 2024

ప్రాంతీయ అంశం పార్టీ వాయిస్సా.. సొంత వ్యవహారమా?

- Advertisement -

ప్రాంతీయ అంశం పార్టీ వాయిస్సా.. సొంత వ్యవహారమా?

Is the regional issue a matter of the party?
హైదరాబాద్, సెప్టెంబర్ 14, (వాయిస్ టుడే)

కారు పార్టీలో ఏం జరుగుతోంది? అంతర్గత కలహాలు ఆ పార్టీని చుట్టుముట్టాయా? కొద్దిరోజులుగా ఎడముఖం పెడముఖంగా ఉన్ననేతలతో కేసీఆర్‌కు దూరం పెరిగిందా? కౌశిక్‌రెడ్డి వ్యవహారంతో కారు పార్టీ రెండు ముక్కలైందా? కౌశిక్ ప్రాంతీయ అంశం పార్టీ వాయిస్సా.. సొంత వ్యవహారమా? సొంతంగా మాట్లాడితే పార్టీ సస్పెండ్ చేస్తుందా? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి. కష్టాలు వచ్చినప్పుడే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కాస్త కోలుతున్న తర్వాత సమస్యలు కొలిక్కివస్తాయి. కానీ కారు పార్టీకి పవర్ పోయిన నుంచి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడం.. నేతలు వెళ్లిపోవడం, ఇప్పుడు అంతర్గత కలహాలు వెంటాడుతున్నాయి. దీన్ని హ్యాండిల్ చేయలేక గులాబీ బాస్ సతమతమవుతున్నారు. అసలే బోలెడు సమస్యలతో గింజుకుంటున్న కారు పార్టీ.. కౌశిక్ వ్యవహారంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోందిబీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి రావడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ మంచి చేస్తారని నమ్మారు. పెద్దాయన ఉండగా అంతా మంచి జరుగుతుందని భావించారు. ప్రస్తుతం అధికారం కోల్పోయినా.. గ్రేటర్‌ ప్రజలు ఆదరణ చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కారు పార్టీ విజయం సాధించింది. కారు బలంగా ఉందని నమ్మారు. హైదరాబాద్ సిటీలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటున్నారు. వారి మధ్య ఏనాడూ ప్రాంతీయ విభేదాలు రాలేదు. కారులోని నేతల మధ్య ఈ చిచ్చు మొదలైంది. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి ఉందో తెలీదుగానీ.. గురువారం నాటికి తారాస్థాయికి చేరింది.ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడిన మాటలతో ఆ పార్టీలో కొందరు నేతలు షాకయ్యారు.. మరికొందరు తప్పుబట్టారు కూడా. ఇంతకీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసి ప్రాంతీయ కామెంట్స్ ఆయన సొంతమా? లేక పార్టీ వాయిస్‌ని బయటపెట్టారా? ఇదే చర్చ తెలంగాణ అంతటా నెలకొంది. ఒకవేళ కౌశిక్ వ్యవహారమైతే ఆయనపై పార్టీ వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ వాయిస్ అయితే రెండుగా చీలిపోవడం ఖాయమని నేతలు చర్చించుకుంటున్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్‌కు ఈ తరహా సమస్యలు రాలేదుదీనివల్ల కారు పార్టీకి గ్రేటర్‌లో ఊహించని దెబ్బ తగులుతుందన్నది నేతల అంతర్గత మాట. ఎందుకంటే ప్రతీ నియోజకవర్గంలోనూ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ వ్యవహారం తర్వాత వారితో అభద్రతా భావం వచ్చినట్టు కనిపిస్తోంది. బస్సుల్లో, రోడ్లపై ఇప్పుడు దీనిపైనే ప్రజలు చర్చించుకుంటున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న ఈ రచ్చకు పెద్దాయన పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదుసైలెంట్‌గా ఉండడం వల్ల ఒక్కోసారి అనర్థాలు వస్తాయని గులాబీ అధినేతకు బాగా తెలుసు. అయినా సెలైంట్ వెనుక కారణమేంటి? కౌశిక్ వ్యవహారంతో గ్రేటర్ హైదరాబాద్‌ లోని కారు పార్టీ నేతలు ఆలోచనలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడకుంటే పార్టీకి మరింత నష్టం కలుగుతుందనే భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్