సుశీలమ్మ కొండలో మరో చిరుతపులి వుందా….!?
ఎమ్మిగనూరు పరిసరాల్లో గల సుశీలమ్మ, గుడికల్లు కొండల్లో చిరుతపులి ని గొర్రెల కాపారులు బందించడం అటవీశాఖ వారు పులిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. చిరుతపులి సంచారాన్ని పసిగట్టిన గుడికల్లు గొర్రెల కాపారులు, రైతులు అటవీశాఖ వారికి తెలపకుండా వారే దాన్ని బందించారు. ఇది వారు తెలియక చేసిన పని. కానీ… ఈ బంధించే క్రమంలో చిరుతపులి కాలు తీవ్రంగా గాయపడింది. ఈ కారరణంగా అటవీశాఖ వారు కేసు నమోదు చేసి కొందరిని రిమాండు జైలుకు పంపారు. కానీ ఈ మధ్యకాలంలో వారు మరో పులి కొండల్లో ఉందని, కొండ గుహ లో దానికి పిల్లలు కూడా వున్నాయని అటవీశాఖ కేసులకు భయపడి తాము ఎవరికీ చెప్పడంలేదని తెలుపుతున్నారు. ఈ విషయం లో అటవీశాఖ పరిశోధించి ప్రజల భయాలని పోగొట్టాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ కొండల్లో రాళ్లు కొట్టుకొనేవారు జాగర్తగా ఉండాలి. ఈ కొండల్లో అక్రమంగా గరుసు తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మిగనూరు రూరల్, పెద్దకడుబూరు పోలీసులు కొండల్లోకి గరుసు తరలించే ట్రాక్టర్లు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ని కోరుతున్నాను. అటవీజంతువులు కనిపిస్తే పోలీసులకు, అటవీశాఖ వారికీ తెలపాలే గాని వాటికి హాని చేయకూడదు. అటవీజంతువుల కు హాని చేస్తే ఆ కేసులలో కాపాడటం ఎవరివల్ల కాదని ప్రజలు గ్రహించాలి.