జనాభా లెక్కలు ఇలా?
విజయవాడ, ఏప్రిల్ 17, ( వాయిస్ టుడే )
Is this how the census is conducted?
జనగణన ప్రారంభమయింది. ప్రస్తుతం ఈరోజు నుంచి స్వీయ నమోదు కార్యక్రమం ప్రారంభమయింది. ఏప్రిల్ నెల 16 నుండి 30 ప్రజలు ఎవరికి వారు.. స్వంతగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. మే 1 నుండి జనాభా లెక్కల అధికారి మీ ఇంటికి వచ్చి పలు ప్రశ్నలు వేస్తారు. వీటికి మీరు సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
జనగణన -2027 లో భాగంగా ఫేజ్-1 ఇళ్ల జాబితా సేకరణ లో అడిగే ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
1. ఇంటి నంబరు
2. జనగణన జాబితాలో కేటాయించిన సంబరు
3. ఇంటిలో ఫ్లోర్ కు వాడిన మెటీరియల్
4. ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్
5. ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్
6. ఇంటిని ఎలా వాడుతున్నారు? (రెసిడెన్షియల్, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఖాళీగా ఉందా)
7. ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా? శిథిలావస్థలో ఉందా?
8. కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత?
9. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారెంతమంది ?
10. ఇంటి పెద్ద పేరు?
11. ఇంటి పెద్ద మహిళ? పురుషుడా?
12. ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా ?
13. ఉంటున్న ఇల్లు సొంతమా? అద్దె ఇల్లా?
14. ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు?
15. ఇంట్లో పెళ్లయిన జంటలు ఎన్ని ఉన్నాయి?
16. తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు?
17. తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయాః
18. ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు. విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర మార్గాలు?
19. మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా?
20. ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి?
21. ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ ఉందా?
22. బాత్రూమ్ కు పైకప్పు ఉందా? డ్రైనేజీ ఉందా?
23. కిచెన్ ఉందా? ఎల్పీజీ/పీఎనీ వాడుతున్నారా?
24. వంటకోసం ప్రధానంగా వాడే ఇంధనం?
25. రేడియో/ట్రాన్సిస్టర్ ఉందా?
26. టీవీ ఉందా?
27. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?
28. ల్యాప్టాప్/కంప్యూటర్లు ఉన్నాయా ?
29. టెలిఫోన్/మొబైల్ ఫోన్లు/స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి?
30. ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి?
31. కారు/జీవు/వ్యాన్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి?
32 ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి?
33. ఫోన్ నంబరు ఏంటి?



