ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం

- Advertisement -

ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం

It is a farmer welfare government

ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

కొత్త చెరువు:11
ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు . కొత్తచెరువు శివాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారితో కలిసి తూము గేట్లను ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ లో అతి పెద్దదైన బుక్క పట్నం చెరువు కింద సుమారు నాలుగు వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతుందని తెలిపారు. 65 ఏళ్ల చరిత్రలో సుమారు 19 సార్లు కరువు వచ్చిందని తెలిపారు. అలాంటిది 2014 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుక్క పట్నం చెరువు కు 3 సార్లు నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు.వైసిపి పాలనలో  చెరువులకు ఒక చుక్క నీరు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.మళ్ళీ 2024 లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి తో పాటు చెరువులకు నీళ్లు ఇచ్చి రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని కోరారు. చివరి అయకట్టువరకు నీటిని అదే అందే విధంగా చూడాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ లేదా పంట నష్టపరిహారం మంజూరు చేసేలా మీ ప్రభుత్వం రైతు వెన్నంట ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం
కొత్త చెరువు మరువ అజనేయ స్వామి ఆలయంలో జరిగిన వివాహానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.పోతు లకుంట కు చెందిన బాగూరు రమేష్ కుమార్తె అనుష్ వెడ్స్ హరీష్ వివాహానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు ఇరిగేషన్ డి ఈ గంగాధర్ ఏఈ సుధాకర్ రాజు జమునబాయి కురబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు కొత్తచెరువు మండల రైతులు కోటమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular