అమాయక ప్రజలను మోసం చేస్తున్నా అంతర్ జిల్లా నిందుతుల అరెస్ట్
వేములవాడ, సెప్టెంబర్ 2 (వాయిస్ టుడే): ఉజ్వల త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. కంపెనీ పేరుతో మోసాలు. 5 బ్రాంచిలలో 1600 మంది దగ్గర సుమారు 3కోట్ల వరకులావాదేవీలు. లావాదేవీల రుపంలో వచ్చిన డబ్బులు తన స్వాలాభం కోసం రియలేస్టేట్, లిక్కర్, చిట్ ఫండ్స్ లలో పెట్టుబడులు. ఇద్దరి నిందుతుల మీద రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలలో 05 కేసులు నమోదు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నిందితుల వివరాలు.కర్ణ శ్రీధర్,

పోతరాజుల లక్ష్మణ్, స్వాధీన పర్చుకున్న వాటి వివరాలు…
టీఎస్19-7943,టాటా జస్ట్ కార్. సొసైటికి సంబందిచిన కరపత్రలు, పాస్ బుక్స్ అకౌంట్ ఓపెనింగ్, క్లోసింగ్ ఫార్మ్స్ లావాదేవీలకు సంబందించిన రిజిస్టర్స్, మూడు మొబైల్ ఫోన్స్.మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.
మంచిర్యాల జిల్లా రామ్ నగర్ కి చెందిన కర్ణ శ్రీధర్ అనే వ్యక్తి 2000 సంవత్సరములో మంచిర్యాల జిల్లా నందు ఉజ్జ్వాలా త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్. స్టాపించి 6 నెలల తేడాతో బెల్లంపల్లి , లక్షేట్టిపేట, సిరిసిల్ల,వేములవాడ నందు సొసైటిలు మొదలు పెట్టి సొసైటిలో మొత్తం దాదాపు 1600 మంది వరకు అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సుమారు వాటి విలవ మూడు కోట్ల వరకు ఉంటుంది.
ఈ కంపెనీ యెక్క వ్యాపార లావాదేవీలు చూసుకొనుటకు శ్రీధర్ పూర్వ విద్యార్థి అయిన, పోతరాజుల లక్ష్మణ్ తో కలిసి ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో ఇట్టి సొసైటికి శ్రీధర్ చైర్మన్,గా లక్ష్మణ్ సి.ఈ.ఓ.గా సొసైటి లో పనిచేయుటకు గాను కొంత మంధి సిబ్బంధిని కూడా నియమించుకొని ప్రజలను నమ్మించి అమాయక ప్రజల దగ్గర నుండి రీకరింగ్ డిపాసిట్స్ ల ద్వారా డబ్బులు వసూలు చేసి వచ్చిన డబ్బులని శ్రీధర్, లక్ష్మణ్ వారి స్వాలాభం కోసం మంచిర్యాల, నిజామాబాద్ జిలాల్లో రియలేస్టేట్, లిక్కర్,చిట్ ఫండ్స్ బిజినెస్ లలో పెట్టుబడికి ఉపయోగించారు.అదేవిధంగా ఇద్దరి పెరు మీద జాయింట్ అకౌంట్ లను ఐసిఐసిఐ , బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లలో ఖాతాలు తెరిచి వాటి ద్వారా ఈ సొసైటి కి సంబందించిన వ్యాపార లావాదేవీలు నిర్వహింస్తున్నారు. సిరిసిల్లలో 2001,వేములవాడ లో 2022 సంవత్సరం లో ఉజ్వల త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ప్రారంబించి ప్రజల దగ్గర నుండి వివిధ స్కీమ్ లలో దాదాపు 150 మందికి పైగా సభ్యత్వం కల్పించి సొసైటిలో అకౌంట్ ఓపెన్ చేయుటకు ఒక్కొక్క ఖాత దారునినుండి 650 రూపాయలు వసూలు చేయడం జరిగింది..డైలీ సేవింగ్స్ స్కీమ్ నందు పొదుపు చేసిన డబ్బులపై 8.50శాతం వడ్డీ , గోల్డ్ సేవింగ్ స్కీమ్ పొదుపు చేసిన డబ్బుల పై 5శాతం వడ్డీ , ఫిక్సెడ్ డెపాసిట్ ల పైన 12శాతం వడ్డీ , మరియు 6శాతం ఫిక్సెడ్ డెపోసిట్ చేసిన డబ్బు రెట్టింపు అవుతుంది. అని కరపత్రలు తయారు చేసి ప్రజలని మోసం చేయగా, 2023 ఆగస్టు 22న వేములవాడ కి చెందిన బుస్స శ్రీనివాస్, బాధితులు ఈ సొసైటీ లో మోసపోయమని గ్రహించి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా 2023 సెప్టెంబర్ 2 రోజున ఉదయం శ్రీధర్, లక్ష్మణ్ కరీంనగర్ నుండి సిరిసిల్ల వ్యాపార నిమిత్తం వస్తుండగా వేములవాడ టౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వేములవాడ నంది కామన్ వద్ద వారి ఇద్దరిని అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన కార్ టీఎస్19-7943 టాటా జస్ట్ కార్ డిక్కిలో దాచిపెట్టిన సొసైటి కి సంబండిచిన పాంప్లెట్స్, పాస్ బుక్స్ , ఏక్కౌంట్ ఓపెనింగ్ మరియు క్లోసింగ్ ఫార్మ్స్ , లావాదేవీలకు సంబందించిన రిజిస్టర్స్,మూడు మొబైల్ ఫోన్స్,సీజ్ చేసి విచారించగా నేరం ఒప్పుకోగా వారిద్దరిని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.

శ్రీధర్, లక్ష్మణ్ ల పైన వేములవాడ టౌన్ పోలీసు స్టేషన్ లో మూడు కేసులు, బెల్లంపల్లి టౌన్ పోలీసు స్టేషన్ ఒక కేసు ,మంచిర్యాల టౌన్ పోలీసు స్టేషన్ లలో మొత్తం 5 కేసులు నమోదు చేయడం జరిగింది.ఈ సొసైటీ లో మోసపోయిన బాధితులు నిర్భయంగా పిర్యాదు చేయాలని,అనుమతి లేని కోపరేటివ్ సంస్థలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలని అన్నారు..



