మద్దూరు, మెల్లేవేముల గ్రామాలలో పొలంపిలుస్తోంది

- Advertisement -

మద్దూరు, మెల్లేవేముల గ్రామాలలో పొలంపిలుస్తోంది

It is flourishing in Maddur and Mellevemula villages

చాగలమర్రి
ఈ రోజు చాగలమర్రి మండలంలోని మద్దూరు మరియు మెల్లేవేముల గ్రామాలలో పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రంగ నేతాజి గారు ప్రస్తుత వార్షాల నేపథ్యంలో వివిధ రకాల పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. మద్దూరు ,మల్లెవేముల గ్రామాల పరిధిలో శనగ మరియు జొన్న పంట అధికంగా సాగు చేయుచున్నారు. అధిక వార్షాల వల్ల పోలంలో నీరు నిలబడకుండా జాగ్రాత్తలు పాటించి మురుగు నీటి కాల్వలు ద్వార బయటకు పంపించాలని తెలిపారు.శనగ పంటలో అధిక తేమ వలన మొదలు కుళ్ళు వచ్చే అవకాశం ఉన్నందున ట్రైకోడర్మ జీవన మందు లేదా కార్బెండజిం+మాంకొజెబ్ మందు 2గ్రా/లీ నీటిలో కలిపి పిచికారి చేసుకోవలెను. గాలులకు నేలవాలిన వరి పైరును కట్టలుగా కట్టుకోవాలని దాని ద్వార ధాన్యం గింజలు నీటిలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు.అధిక వర్షాలకు తడిచిన వరి ధాన్యం పై 5% ఉప్పు ద్రావణం పిచికారి చేసుకోవాలని తద్వారా గింజలు మొలకరాకుండా అరికట్టవచ్చునని తెలిపారు. అదే విధంగా పంట భీమా కొరకు రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించుటకు ఈ నెల 15 వరకు ఉన్నందున తప్పకుండా రైతులు మీ పరిధిలొని రైతు సేవా కేంద్రం నందు పంట వేసిన పత్రం, ఆధార్ మరియు బ్యాంకు పాసుబుక్ తీసుకుని మీ సేవా కేంద్రం లేదా సి.ఎస్.సి నందు కాని చెల్లించవచ్చునని కోరడమైనది.అదే విధంగా రబీలో వేసిన పంటలను తప్పకుండా ప్రతి రైతు ఈ పంటలో నమోదు చేసుకోవాలని లేనిచో పంట భీమా వంటి ఇతర పథకములు వర్తించవని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular