అక్రమ క్వారీలపై ఉక్కుపాదం: ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి
అర్మూరు: జీవన్ రెడ్డి నన్ను చంపడం నీ తరం కాదు ,ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎన్నో చూశా. విదేశాల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సహజ సిద్ధ వనరులు అనుమతి లేకుండా అక్రమ క్వారీ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్న వారిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న పైడి, అక్రమ క్వారీ తవ్వకాలపై సిబి, సిఐడి ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేసారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్, మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో అక్రమంగా క్వారీ తవ్వకాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. తరువాత స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నన్న పైడి. అక్రమ క్వారీ తవ్వకాలపై సిబి, సిఐడి ఎంక్వైరీ నిర్వహించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అనుమతులు తీసుకున్నది గోరంత తవ్వకాలు కొండంతగా ఉన్నాయని విమర్శించారు. అధికారులకు ఒత్తుడులు ఉన్న విషయం తనకు తెలుసునని, లీజుకు తీసుకున్న వారు వేలకోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రకృతి సాహసిద్ధ వనరులను కాపాడేందుకు అక్రమ క్వారీ తవ్వకాల వెనకాల ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ భయపడి లేదని అయనఅన్నారు.