- Advertisement -
తనకు ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవం
It is true that he has received ED notices
తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పసలేని కేసులు పెట్టారు
ఏసీబీ కేసులో మండిపడ్డ కేటిఅర్
హైదరాబాద్ డిసెంబర్ 30
ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి స్పందించారు. తనకు ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమని అన్నారు. తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పసలేని కేసులు పెట్టరాని మండిపడ్డారు. ఏసీబీ కేసులో బలం లేదని సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని తెలంగాణ హైకోర్టులో క్వాష్ వేశానని… తాను ఆశావాదిని అని తెలిపారు. హై కోర్టులో ఏం జరుగుతుందో.. రేపు తెలుస్తుందన్నారు. కేసులను లీగల్ గానే ఎదుర్కొంటానని. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను మాట మార్చలేదని. ఈ కేసులో మెదటిరోజు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నానని తేల్చిచెప్పారు. ఫార్ములా ఈ రేసుకు మంత్రి హోదాలోనే తానే డబ్బులు కట్టామన్నానని తేల్చిచెప్పారు. ప్రొసీజర్ ప్రకారం జరగకుంటే.. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్, ఆర్బీఐ దగ్గరకు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. కట్టిన ప్రతి పైసకు లెక్క ఉందని స్పష్టం చేశారు. డబ్బులు ముట్టినవారిపై కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ ఏడాది చివరకు బీఆర్ఎస్ క్యాడర్‌లో విశ్వాసం, ఆత్మసైర్యం కన్పిస్తోందని చెప్పారు.2024లో ప్రతికూలతలను తట్టుకుని నిలబడ్డామన్నారు. 2024 కాంగ్రెస్ ప్రభుత్వ ఢోకా నామ సంవత్సరమని ఆరోపించారు. 2004లో బీఆర్ఎస్ పార్టీకి కొంత గడ్డు కాలం నడిచిందని అన్నారు. హామీల అమల్లో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో నిరాశ కన్పిస్తుందని చెప్పారు. హామీలపై పెట్టుకున్న డెడ్‌లైన్లు కాంగ్రెస్‌కు శాపంగా మారాయని విమర్శించారు. కొత్త ఏడాదిలో రైతులను మోసం చేయటానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏడాది చివరకు బీఆర్ఎస్ క్యాడర్‌లో విశ్వాసం, ఆత్మసైర్యం కన్పిస్తోందని అన్నారు. 2024లో ప్రతికూలతలను తట్టుకుని నిలబడ్డామన్నారు. ఎప్పుడు బయటకు రావాలో మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు అని చెప్పారు. 24ఏళ్లు కేసీఆర్ కష్టపడ్డారని… కాస్త రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు.తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావుకు గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుందని అన్నారు. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారని ఆరోపించారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే.. కేంద్రమే కాపాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని విమర్శలు చేశారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా కమిటీలు వేస్తామని అన్నారు. కోర్టులో కేసులు వేయించి లోకల్ బాడీస్‌లో బీసీల రిజర్వేషన్లు కోత విధించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. లోకల్ బాడీస్‌లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.
- Advertisement -