అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత నిర్వహించుకోవాలి

- Advertisement -

దేవరగట్టు బన్ని ఉత్సవం
ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో   నిర్వహించుకోవాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు,

It should be conducted in a calm environment without any untoward incidents

 

ఈ నెల 12 న  జరుగబోయే దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని  ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో     నిర్వహించుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులకు సూచిస్తూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫు నుంచి చేయవలసిన  ఏర్పాట్లను చేయాలని  జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో దేవరగట్టు  బన్ని ఉత్సవ ఏర్పాట్ల పై అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో  కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెరణికి,  నెరణికి  తాండ,కొత్తపేట,  దేవరగట్టు గ్రామాల ప్రజలు  బన్ని ఉత్సవాన్ని ఎలాంటి సమస్యలు రాకుండా పండుగ లాగా జరుపుకోవాలని సూచించారు.. ఎవరూ గాయపడడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరగకుండా సంతోషకరమైన వాతావరణంలో ఉత్సవం జరుపుకోవాలని కలెక్టర్ నాలుగు గ్రామాల తరఫు నుంచి హాజరైన సభ్యులకు సూచించారు..ఉత్సవ నిర్వహణకు ప్రభుత్వం తరఫు నుంచి వసతుల కల్పన తదితర అంశాలపై ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యుల కోరిక మేరకు సుమారు 2 లక్షల మంది ప్రజలకు త్రాగు నీరు అందించే విధంగా వాటర్ ప్యాకెట్ లను ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరా లో ఎలాంటి లోపాలు లేకుండా  చూసుకోవాలని   కలెక్టర్ విద్యుత్  శాఖ అధికారులను ఆదేశించారు.
బన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. అదే విధంగా దేవరగట్టు బన్ని ఉత్సవాల పై డివిజనల్ స్థాయిలో కూడా సమీక్ష చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ కు సూచించారు. పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లను చూసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని  ఆదేశించారు. నెరణికి, దేవరగట్టు రోడ్ల కు సంబంధించి అవసరమైన చోట ప్యాచ్ వర్క్స్  చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను  ఆదేశించారు. అరికెర నుండి దేవరగట్టు వరకు, నెరణికి నుండి దేవరగట్టు వరకు రోడ్లను చెక్ చేసి ఎస్టిమేట్ సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కట్టుదిట్టమైన  బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను  ఆదేశించారు. సత్వర వైద్యసేవలకై అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కలిగిన 4 అంబులెన్సు లు, టెంపరరీగా 20 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాలని, మెడికల్ క్యాంపు లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఎంహెచ్వో ను  ఆదేశించారు.

బన్ని ఉత్సవం రోజున అక్రమ మద్యం సరఫరా , మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని అబ్కారీ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక  శాఖ అధికారులను ఆదేశించారు. .  మైక్ సిస్టం, లైట్ అరేంజ్మెంట్ తదితర  ఏర్పాట్లు చేయాలని సంబంధిత  శాఖల అధికారులను ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular