శ్రీరాముని వారధి కట్టిన సైన్యంలా తయారు కావాలి
It should be made like the army that built Sri Ram's bridgeసత్యానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామీజీ
జగిత్యాల, డిసెంబర్ 04
:రీల్ హీరోలం కాదు.. రియల్ హీరోలుగా ఒక కృష్ణ దాసుగా, ఒక అర్జునునిగా, శ్రీరాముని వారధి కట్టిన సైన్యంలా తయారు కావాలని
సత్యానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామీజీ పిలుపు నిచ్చారు.. బుధవారం జిల్లా కేంద్రంలో హిందూ ఏకత ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో కృష్ణ దాస్ ను అరెస్ట్ నిరసిస్తూ విశేష సంఖ్యలో వివిధ ధార్మిక కుల సంఘాల, ఆధ్యాత్మిక సంఘాల
సంయుక్తంగా నిరసన ర్యాలీలో చేపట్టారు. ఈ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రామాయణంలో సాక్షాత్తు విష్ణుమూర్తి అస్త్రం పట్టి అమ్మవారిని కాపాడుకోగలిగాడని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయడానికి అర్జునుడికి ధైర్యం కల్పించి యుద్ధం చేయించి ధర్మం కాపాడాడని రామాయణ భారతాలను ఉటంకించారు. కేవలం ఆలయాలకు వెళ్లడమే హిందుత్వం కాదు, బొట్టు పెట్టుకుంటే హిందువులం కాదు, పూజా క్రతువులు చేస్తే హిందువులం కాదు ,మనం వెళ్లే ఆలయానికి ఇబ్బంది వస్తే తన కుటుంబంతో సహా కలసి పోరాడుతానని ఎవడైతే ఆలయాన్ని కూల్చిన వాడిని కనపడకుండా చేస్తానను అనే ధైర్యం హిందువులకు రావాలని ఆయన అన్నారు. ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం చేశారని అదేవిధంగా ఏపీలో ఎన్నో దేవాలయాలు కూల్చివేశారని ఇప్పటికే ఎన్నో ఆలయాలు ధ్వంసం అయ్యాయని మనం కలిసి ఏకం కాకపోతే మన పక్కన ఉండే వాడే శత్రువుగా మారుతాడు అని అన్నారు. మనోధైర్యాన్ని చూపిద్దామా ? అని పలుమార్లు ప్రశ్నించారు. నిజామాబాదులో తమ ఆశ్రమానికి చుట్టుపక్కల హిందూ వేతరుల వల్ల తమకు ఇబ్బంది కలిగిందని అక్కడి తమ ఆశ్రమాన్ని అమ్ముకోవాల్సిన దుర్గతి గమనిస్తే మనది హిందూ దేశమేనా? అన్న సంశయం కలుగుతుందని అన్నారు. ధర్మం నిలబెట్టాల్సిన అవసరం లేదా ?అని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ లో కృష్ణ దాస్ అరెస్టుపై ఇస్లామిక్ తీవ్రవాదుల కుట్ర అని కృష్ణ దాసుకు న్యాయ సహాయం చేస్తామని ముందుకు వచ్చిన న్యాయవాదిపై దాడి చేయడం శోచనీయమన్నారు.. బంగ్లాదేశ్ స్వదేశంగా అవతరించడానికి భారత ప్రభుత్వం ,భారత సైన్యం ఎంతో త్యాగం చేసిందని తాము సెక్యులర్ వాదులుగా ఉంటామన్న బంగ్లాదేశ్ నేడు మతరాజ్యంగా మార్చడానికి హిందువులపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు. మన దేశ ప్రభుత్వం అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో శ్రీకృష్ణ ఆనంద గిరి స్వామి, జగదీశ్వరానంద స్వామి, శ్రీ ఆత్మానంద గిరి స్వామి, విషుశర్మ ,లక్ష్మీనారాయణ స్వామి ,మానాల కిషన్ గురుస్వామి, దశరథ్ రెడ్డి గురుస్వామి ,డాక్టర్. వెంకటరాజిరెడ్డి, డాక్టర్. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, జిడిగే పురుషోత్తం, పద్మాకర్, వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక, కుల సంఘాల నాయకులు, పాల్గొన్నారు.




