Sunday, February 9, 2025

 కామారెడ్డి డిక్లరేషన్ కు పంగనామాలు పెట్టిన కాంగ్రెస్

- Advertisement -

 కామారెడ్డి డిక్లరేషన్ కు పంగనామాలు పెట్టిన కాంగ్రెస్

It was the Congress that called Kamareddy's declaration

చట్ట బద్దత కల్పించకుండా బి.సిలను మోసం చేసిన కాంగ్రెస్
వనపర్తి
కాంగ్రెస్ పార్టీ జనాభాలో 50శాతం పైగా ఉన్న బి.సి లకు అంతే శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పి 14నెలలుగా ఊరించి ఇప్ప్పుడు ఆదరాబాదరాగా సర్వే నిర్వహించి 42శాతంగా తేల్చడాని బి.సి బిడ్డలను మరోసారి మోసం చేయడానికే అని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుజిల్లా బి.ఆర్.ఎస్ మీడియా కన్వీనర్ పి.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ ఆరోపించారు.
కె.సి.ఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1.85 కోట్లు ఉన్న రాష్ట్ర జనాభా ఇప్పుడు 1.64 కోట్లకు తిరోగమన దిశలో ఉండడమంటే ఇది కాంగ్రెస్ కుట్రే అని తేల్చారు.  కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.సిల ఓట్లు కొల్లగొట్టడానికి బి.సి ల పట్ల ప్రేమ ఒలకబోస్తూ అసెంబ్లీలో చట్ట బద్ధత కల్పించకుండా కేంద్రం మీదికి నెపం నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకున్నారు అని అశోక్ దుయ్యబట్టారు. కేవలం 96శాతం సర్వే జరిగింది అని చెబుతున్న ప్రభుత్వం నిజాలను దాచిపెట్టి సభను తప్పుదోవ పట్టించిందని పట్టణ ప్రాంతాలలో కేవలం 35శాతం మాత్రమే ప్రజలు వివరాలు నమోదు చేసుకున్నారని 4శాతం మంది తమ వివరాలు నమోదు చేసుకోలేదని ఇన్ని తప్పు తడకలు పెట్టుకొని ఏట్లా బి.సి ల జనాభా శాతం 42 శాతం అని తెలుస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం బి.సి.జనాభా లెక్క తేల్చి చట్టబద్ధత కలిపించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పి.రమేష్ గౌడ్ ,నందిమల్ల.అశోక్ డిమాండ్ చేశారు.            ప్రభుత్వ లెక్కల ప్రకారం 20శాతం మిగిలిపోయిన బి.సి.జనాభా లెక్కించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్