జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మెదక్, డిసెంబర్ 30, (వాయిస్ టుడే) : ప్రజాపాలన అర్జీలు వచ్చే నెల 06- జనవరి- 2024 వరకు అన్ని ప్రభుత్వ పనిదినములలో స్వీకరించడం జరుగుతుందని, దరఖాస్తుల స్వీకరణ లో ప్రజలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం నాడు మెదక్ పట్టణం లో ని 12 వ వార్డ్ పరిధి లో ప్రజాపాలన మూడవ రోజు ద్వారకా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ధరఖాస్తులు ఏ విధంగా పూరించి ఇస్తున్నారు, ధరఖాస్తులు రిజిస్టర్ లలో ఏ విధంగా నమోదు చేస్తున్నారు పరిశీలించి సూచనలు చేశారు. ప్రతి ధరఖాస్తు కు తప్పని సరిగా రసీదు అంద చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమాలలో తగినన్ని కౌంటర్ల ఏర్పాట్లతో ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నదని, ప్రతి ఒక్కరి దరఖాస్తు తీసుకుంటారని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జీరాక్సులు, ఒక ఫోటో దరఖాస్తుకు జోడించాలని, ప్రజల ముంగిటిలోనికి, ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు అవసరమున్న పథకాలను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ప్రజాపాలన అర్జీలు వచ్చే నెల 06- జనవరి- 2024 వరకు అన్ని ప్రభుత్వ పనిదినములలో స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులను సమర్పించడానికి వచ్చే ప్రజలకు దరఖాస్తు నమోదులో అవగాహన కల్పించడం తో పాటు వారికి సహకారాన్ని అందించాలని సూచించారు. దరఖాస్తు కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని,షామియానా,త్రాగు నీరు ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజలకు దరఖాస్తులు అందు బాటు లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డి ఈ మహేష్ , డి టి శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.
వచ్చే నెల 06- జనవరి- 2024 వరకు అన్ని ప్రభుత్వ పనిదినములలో స్వీకరించడం జరుగుతుందని
- Advertisement -
- Advertisement -