- Advertisement -
నేటితో ముగియనున్న
పారా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి దరఖాస్తులు
గడువు
జగిత్యాల,
నేషనల్ హెల్త్ మిషన్ కింద జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రిలలో పారా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా, (నేటి) సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు గడువు ముగియనుంది. ఇందులో ఏ ఎన్ ఎం తో పాటు ల్యాబ్ టెక్నీషియన్, పార్మాసిస్టు తదితర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద అభ్యర్థులు దరఖాస్తులు అందించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు క్యూ లైన్ లో నిరీక్షిస్తున్నారు.
- Advertisement -