కోదాడ/హుజూర్ నగర్ ఆగస్టు (వాయిస్ టుడే ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడిగా జిల్లేపల్లి వెంకటేశ్వర్లు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ , తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హరి శంకర్ పటేల్ నియామక పత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ జె.వి.ఆర్ రాజకీయంగా విశేష అనుభవం ఉన్న వ్యక్తి అని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్గా పనిచేసి రాష్ట్రస్థాయి నాయకుడిగా పేరు సంపాదించారన్నారు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న విషయంలో విశేష అనుభవం ఉన్న జేవియర్ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సంఘం అభివృద్ధికి కృషి చేస్తాడని నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షులు నియమించినట్లు తెలిపారు.రాష్ట్రంలో మున్నూరు కాపు కులస్తులకు అన్ని పార్టీలు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేవీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులను ఒక బలమైన శక్తిగా తయారు చేయడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపుల రాజకీయ వాటా కోసం కాపులు ఐక్యంగా పోరాడేసిన అవసరం ఉందన్నారు. కాపుల హక్కుల కోసంపోరాటాలునిర్వహిస్తామని అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాపుల బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కొండా దేవయ్య పటేల్ కి హరిశంకర్ పటేల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ మహేందర్, ఆకుల బాలకృష్ణ తెల్లారి కృష్ణ వెంకటేశ్వర్లు నల్వాల రవీందర్ పైడాకుల అశోక్ సత్తెర శ్రీనివాస్ తదితరులు ఈ నియామక కార్యక్రమంలో పాల్గొన్నారు.