ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తిరిగి జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. కొత్త ప్రభుత్వం వైసీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రక్షాళన చేస్తోంది. ఈ సమయంలోనే ముందుగా నెల్లూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ నేత పిన్నెల్లిని జగన్ పరామర్శించనున్నారు. ఆ తరువాత కడప జిల్లాకు జగన్ వెళ్లనున్నరు. ఒకే రోజు..ఒకే వేదిక మీదకు జగన్..షర్మిల రానుండటం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
ఇడుపులపాయలో ఈ నెల 8న వైఎస్సార్ 75వ జయంతి. ఆ రోజున తమ తండ్రికి నివాళి అర్పించేందుకు వైసీపీ అధినేత జగన్…పీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. రాజకీయంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. తాజా ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. షర్మిల తన ఎన్నికల ప్రచారంలో జగన్ లక్ష్యంగానే ఆరోపణలు చేసారు. జగన్ సైతం షర్మిల పేరు ప్రస్తావన చేయకుండానే కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ఓటమి తరువాత ఇప్పటి షర్మిల తన అన్న పైన రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయలేదు.
వైఎస్సార్ కు నివాళి వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ షర్మిల, సునీత వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక..ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పుడు జగన్ ముందుగా పార్టీ ప్రక్షాళన పైన కసరత్తు చేస్తున్నారు. జల్లాల పర్యటనలకు నిర్ణయించారు. పార్టీ కేడర్ తో మమేకం అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 8న వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు జగన్ ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం షర్మిల ఇడుపుల పాయకు చేరుకుంటారని సమాచారం. ఇద్దరు కలిసి నివాళి అర్పిస్తారా..వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
రాజకీయంగా ఆసక్తి అదే రోజున షర్మిల విజయవాడ కేంద్రంగా ప్రత్యేకంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తల్లి విజయమ్మ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను షర్మిల ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఆహ్వానించారు. ఇటు జగన్ ఆ రోజున సాయంత్రం వరకు ఇడుపుల పాయలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో..8వ తేదీన ఇడుపులపాయలో జగన్ – షర్మిల ఒకే వేదిక మీదకు వస్తుండటంతో రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.
ఒకే వేదిక మీదకు జగన్, షర్మిల
- Advertisement -
- Advertisement -